వాషింగ్టన్ : అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఇండియన్ ఐటీ నిపుణులకు శుభవార్త అందనుంది. ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వేలాది మందికి రిలీఫ్ దొరకనుంది. గ్రీన్ కార్డుల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం వెలువరించనుంది. ఈ మేరకు యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లాటరీ విధానంలో గ్రీన్ కార్డులు కేటాయిస్తుండగా... కొత్త విధానంలో నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఇవ్వనున్నారు.
గ్రీన్ కార్డుల జారీలో ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న వారి కుటుంబీకులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం నిపుణల ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్రంప్ గురువారం వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో కీలక ప్రకటన చేయనున్నట్లు ప్రెసిడెంట్ ఆఫీస్ వెల్లడించింది.

కొత్త విధానం వెనుక ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కృషి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అమలైతే.. అమెరికా టెక్నికల్ నీడ్స్ తీర్చేవారికే గ్రీన్ కార్డుల జారీలో ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12శాతం గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో 100శాతం గ్రీన్ కార్డులు నైపుణ్యం ఆధారంగా కేటాయించనున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే హెచ్ 1బీ వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులకు త్వరగా గ్రీన్ కార్డులు లభించే అవకాశం ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications