For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాలో అత్య‌ధిక వేత‌నాలు ఇస్తున్న కంపెనీలు

ప్ర‌తిభ‌ను గుర్తించ‌డంలో అమెరికా ముందు ఉన్న‌ట్లే ప్ర‌తిభ‌కు త‌గ్గ‌ట్లు ప్ర‌తిఫ‌లాల‌ను అందించ‌డంలో అమెరిక‌న్ టెక్ దిగ్గ‌జాలు పోటీ ప‌డుతున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగుల‌కు అత్య‌ధిక వేత‌నాలు అందిస్తున

|

గ్లాస్‌డోర్, అమెరికాలో వివిధ కంపెనీలు అందించే స‌గ‌టు వేత‌నాల ఆధారంగా అత్య‌దిక వేత‌నాలు అందిస్తున్న కంపెనీల జాబితాను త‌యారుచేసింది. ఎప్ప‌టిలాగే అమెరికాలో ఎక్కువ వేత‌నాలు చెల్లించే వాటిలో చాలా వ‌ర‌కూ టెక్నాల‌జీ కంపెనీలే ఉన్నాయి. ప్ర‌తిభ‌ను గుర్తించ‌డంలో అమెరికా ముందు ఉన్న‌ట్లే ప్ర‌తిభ‌కు త‌గ్గ‌ట్లు ప్ర‌తిఫ‌లాల‌ను అందించ‌డంలో అమెరిక‌న్ టెక్ దిగ్గ‌జాలు పోటీ ప‌డుతున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగుల‌కు అత్య‌ధిక వేత‌నాలు అందిస్తున్న ప‌ది కంపెనీల గురించి తెలుసుకుందాం.

1. వీఎమ్‌వేర్‌(VMware)

1. వీఎమ్‌వేర్‌(VMware)

కంప్యూట‌ర్ల స‌ర్వ‌ర్ల‌ను త‌యారుచేయ‌డం ప్ర‌ధాన వ్యాపారంగా క‌లిగిన సంస్థ ఇది. అంతే కాకుండా కంప్యూట‌ర్ నెట్‌వ‌ర్కింగ్‌, మొబైల్ ప‌రిక‌రాల‌కు సాఫ్ట్‌వేర్‌ల‌ను త‌యారుచేయ‌డం చేస్తుంది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,67,050 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,36,750 డాల‌ర్లు

 2. స్ప్లంక్

2. స్ప్లంక్

స్ప్లంక్ సంస్థ బిగ్ డేటా సాఫ్ట్‌వేర్ తయారీ, హార్డ్‌వేర్ రంగంలోనూ ఉంది. ఆప‌రేష‌న‌ల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ప‌లు సాఫ్ట్వేర్ కార్య‌క‌లాపాల‌ను చూస్తోంది. స‌ర్వ‌ర్లు, యాప్లు, లాగిన్ డేటా బ్యాకెండ్ ప‌నులు, క్లాడ్‌ల‌కు సంబందించి డేటా నిర్వ‌హ‌ణ‌ను ఇది చేప‌డుతుంది.

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,32,500 డాల‌ర్లు

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,61,010 డాల‌ర్లు

3. క్యాడెన్స్

3. క్యాడెన్స్

క్యాడెన్స్ సంస్థ ఇండ‌స్ట్రియ‌ల్ డిజైన‌ర్ల‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌, ప‌రిక‌రాల త‌యారీలో ఉంది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,56,702 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,41,202 డాల‌ర్లు

4. గూగుల్

4. గూగుల్

ఇంట‌ర్నెట్ సెర్చింగ్‌, డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌లు, యాండ్రాయిడ్ ఫోన్ల‌కు, ఈమెయిల్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌ల‌కు గూగుల్ చిరునామాగా మారింది. గూగుల్ సొంత సంస్థ యూట్యూబ్ వీడియోల‌కు పెట్టింది పేరు. ఇక్క‌డ నిమిషానికి 300 గంట‌ల నిడికి స‌మాన‌మైన వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. గూగుల్ నిరంతరం సృజ‌నాత్మ‌క‌త దిశ‌గా ఉద్యోగుల‌ను ప్రోత్స‌హిస్తుంది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,55,250 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,20,000 డాల‌ర్లు

5. ఫేస్‌బుక్‌

5. ఫేస్‌బుక్‌

సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్ ఒక కొత్త ఒర‌వ‌డిని సృష్టించింది. ఇప్ప‌ట్లో యువ‌త ప్ర‌తి రోజూ కొన్ని గంట‌ల‌పాటైనా ఫేస్‌బుక్ చూడందే ఉండ‌లేక‌పోయేంత‌గా అది విస్త‌రించింది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,55,000 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,30,000 డాల‌ర్లు

6. ఎన్వీడియా

6. ఎన్వీడియా

గ్రాఫిక్ ప్రాసెస‌ర్ టెక్నాల‌జీల త‌యారీదారు ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ‌. కాలిఫోర్నియా కేంద్రంగా ఇది ప‌నిచేస్తోంది. మొబైల్ కంప్యూటింగ్‌లకు సంబంధించి ఎస్‌వోసీలు, గేమింగ్ మార్కెట్కు అవ‌స‌ర‌మైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు(జీపీయూ) డిజైన్ల‌లో ప్ర‌పంచ దిగ్గ‌జంగా ఇది వెలుగొందుతోంది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,54,000 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,50,000 డాల‌ర్లు

7. అమెజాన్ ల్యాబ్‌126

7. అమెజాన్ ల్యాబ్‌126

ఈ-కామ‌ర్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ అమెజాన్‌. శాన్‌ప్రాన్సిస్కో బే ఏరియా ప‌రిశోధ‌న‌, అభివృద్ది సంస్థ అమెజాన్ ల్యాబ్126. అమెజాన్‌కు సంబంధించిన ప్ర‌ధాన ప‌రిశోధ‌న‌ల‌న్నీ ఈ సంస్థే చూస్తుంది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,52,800 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,30,400 డాల‌ర్లు

8. జూనీపర్ నెట్‌వర్క్స్ (Juniper Networks):

8. జూనీపర్ నెట్‌వర్క్స్ (Juniper Networks):

కార్పొరేట్ నెట్‌వ‌ర్క్ల‌ను త‌యారు చేసేందుకు అవ‌స‌ర‌మైన యంత్రాల త‌యారీ జూనీప‌ర్ నెట్‌వ‌ర్క్స్ చేపడుతుంది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,50,000 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,38,500 డాల‌ర్లు

9. లింక్డ్ ఇన్‌

9. లింక్డ్ ఇన్‌

ఉద్యోగార్థుల‌కు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ ఏర్పాటు చేసుకోవ‌డంలో, ఉద్యోగులంద‌రినీ వృత్తిప‌రంగా క‌లిపేలా, వివిధ వృత్తుల్లో ఉన్న‌వారు ఒక‌రినొక‌రు ఆన్లైన్‌లో క‌లుసుకునేందుకు లింక్‌డ్ ఇన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. రిక్రూట‌ర్ల‌కు సైతం ఉద్యోగ ప్ర‌య‌త్నార్థుల‌ను శోధించి ఇవ్వ‌డంలో లింక్డ్ఇన్ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,50,000 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,27,000 డాల‌ర్లు

10. సేల్స్‌ఫోర్స్‌

10. సేల్స్‌ఫోర్స్‌

క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన సాప్ట్వేర్ల‌ను ఇది అబివృద్ది చేస్తుంది. కంపెనీల‌కు వివిధ ల‌క్ష్యాల‌ను చేర‌డంలో సేల్స్ ప‌ర్స‌న్‌కు ఉప‌యోగ‌ప‌డే సాఫ్ట్‌వేర్‌ల‌ను ఇది తయారుచేస్తుంది. దీని ద్వారా కంపెనీలు ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకోవ‌డంలో, పురోగ‌తిని గ‌మ‌నించ‌డం వంటివి చేయ‌డం సులువు అవుతుంది.

మొత్తం చెల్లింపుల స‌గ‌టు: 1,50,000 డాల‌ర్లు

క‌నీస వేత‌న స‌గ‌టు: 1,20,000 డాల‌ర్లు

English summary

అమెరికాలో అత్య‌ధిక వేత‌నాలు ఇస్తున్న కంపెనీలు | 10 highest paying companies in the america

These are the companies paying high salaries for the employees in the US
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X