For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఐటీ ఫామ్స్: కరెంట్ బిల్లు రూ.1 లక్ష దాటినా,బ్యాంకులో రూ.1 కోటి ఉన్నా ఐటీ రిటర్న్స్ తప్పనిసరి

|

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR) దాఖలుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త ఫారాలను నోటిఫై చేసింది. బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లు లేదా భారీగా కరెంట్ బిల్లు కడుతూ మాకేం ఆదాయం లేదు, రిటర్న్స్ ఫైల్ చేయమని చెబితే ఇక కుదరదు. ఇలాంటి వారు కచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. 2020 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2020-21 అసెస్‌మెంట్ ఇయర్ నుండే ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.

ఆదాయపుపన్ను రిటర్న్స్ గడువు తేదీ మూడు నెలలు పొడిగింపు, TDSపై శుభవార్తఆదాయపుపన్ను రిటర్న్స్ గడువు తేదీ మూడు నెలలు పొడిగింపు, TDSపై శుభవార్త

కరెంట్ బిల్లు లక్ష దాటినా, ఖాతాలో కోటి దాటినా..

కరెంట్ బిల్లు లక్ష దాటినా, ఖాతాలో కోటి దాటినా..

సహజ్ (ఐటీఆర్-1), ఐటీఆర్-2, ఐటీఆర్-3, సుగమ్ (ఐటీఆర్-4), ఐటీఆర్-5, ఐటీఆర్-6, ఐటీఆర్-7, ఫాం ఐటీఆర్-v(వెరిఫికేషన్) CBDT శనివారం నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన వివరాలు వీటిలో తెలియజేయాల్సి ఉంటుందని CBDT స్పష్టం చేసింది. కరెంట్ ఖాతాలో డిపాజిట్లు రూ.1 కోటికి మించి ఉంటే, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేసి ఉంటే, విద్యుత్ బిల్లు రూ.1 లక్,కు మించితే ఐటీ రిటర్న్స్‌లో తెలియజేయాలి.

కొత్త ఐటీ ఫామ్ ప్రకారం..

కొత్త ఐటీ ఫామ్ ప్రకారం..

- ఈ కొత్త ఐటీ ఫామ్ ప్రకారం పన్ను ఆదా పెట్టుబడులు, విరాళాల వివరాలను ప్రత్యేకంగా సమర్పించాలి.

- ఏదైనా బ్యాంకులో కరెంట్ ఖాతాలో డిపాజిట్లు రూ.1 కోటి దాటితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి.

- వార్షిక పవర్ బిల్లు రూ.1 లక్ష లేదా అంతకుమించి దాటితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి.

- ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలు, అంతకుమించి ఖర్చు చేస్తే వెల్లడించాలి.

- పన్ను చెల్లింపుదారులు కొత్త ఐటీఆర్‌లో అధిక వ్యయాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ వివరాలు తెలియజేయాలి.

ఆదాయపుపన్నుదారుల ప్రయోజనం కోసం..

ఆదాయపుపన్నుదారుల ప్రయోజనం కోసం..

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం పొడిగించిన పలు ప్రయోజనాలను ఆదాయపుపన్నుదారులు పొందేందుకు వీలుగా ఐటీఆర్ పత్రాలను సవరించింది. దీని ప్రకారం 2020 జూన్ వరకు పన్ను మినహాయింపు పొందే పెట్టుబడులు లేదా చందాలను కూడా ప్రత్యేకంగా చూపించుకోవచ్చు.

ఆదాయపు పన్ను చట్టం 1961కి ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ ఆర్డినెన్స్ 2020 ద్వారా కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. గడువును పొడిగించింది.

దీని ప్రకారం సెక్షన్ 80సీ, 80డీ, 80జీ కింద చేసే పెట్టుబడులు లేదా చెల్లింపులు లేదా చందాలను మదింపుదారులు రిటర్న్స్‌లో చూపించి ప్రయోజనం పొందవచ్చు.

సవరించిన ఫామ్స్

సవరించిన ఫామ్స్

కరోనా కారణంగా పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం వివిధ కాలపరిమితిల పొడిగింపు ప్రయోజనాలను కల్పించింది. వీటిని పొందేందుకు ఐటీ రిటర్న్స్ ఫామ్‌లను సీబీడీటీ తాజాగా సవరించింది. ఎప్పుడూ ఏప్రిల్ మొదటి వారంలో ఐటీఆర్ ఫామ్‌లను ఐటీ శాఖ ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది జనవరిలోనే ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫామ్‌లను విడుదల చేసింది. కరోనా సంక్షోభం కారణంగా ఇప్పుడు అన్ని ఐటీ ఫామ్‌లను సవరించింది.

నవంబర్ 30 వరకు గడువు, ఈ మార్పులు

నవంబర్ 30 వరకు గడువు, ఈ మార్పులు

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్‌ను సమర్పించేందుకు నవంబర్ 30వ తేదీ వరకు గడువును పొడిగించింది.

ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఉంది.

ఐటీఆర్-4లో ఆధార్ నెంబర్‌ను సమర్పిస్తే పాన్ నెంబర్ తప్పనిసరి కాదని సీబీడీటీ తెలిపింది.

ఐటీఆర్-1లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విభజించడంతో పాటు కొత్త కాలమ్ NAను జత చేర్చింది.

ఏ ఐటీఆర్ ఎవరి కోసం?

ఏ ఐటీఆర్ ఎవరి కోసం?

ఐటీఆర్-1 (సహజ్) - వార్షిక ఆదాయం రూ.50 లక్షలు మించని సాధారణ పౌరులు.

ఐటీఆర్-2 : వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు (వ్యాపార, వృత్తిరీత్యా రాబడిలేనివారు)

ఐటీఆర్-3: వ్యాపార ఆదాయం కలిగిన వ్యక్తులు

ఐటీఆర్-4 సుగమ్: వృత్తి లేదా వ్యాపారం ద్వారా రూ.50 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్‌యూఎఫ్, సంస్థలు

ఐటీఆర్-5: పరిమిత భాగస్వామ్య సంస్థలు (ఎల్ఎల్‌పీ), అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (ఏఓపీ)

ఐటీఆర్-6: సెక్షన్ 11 కింద మినహాయింపు కోరని సంస్థలు

ఐటీఆర్-7: ట్రస్ట్స్, ధార్మిక సంస్థల ఆస్తులపై ఆదాయం పొందే వ్యక్తులు

ఐటీఆర్-వీ: వెరిఫికేషన్ కోసం

English summary

కొత్త ఐటీ ఫామ్స్: కరెంట్ బిల్లు రూ.1 లక్ష దాటినా,బ్యాంకులో రూ.1 కోటి ఉన్నా ఐటీ రిటర్న్స్ తప్పనిసరి | vNow it's must to file income-tax return if Power bill over Rs 100,000

The government has notified new income-tax return forms for 2019-20, making it mandatory for high spenders to file ITR and allowing assesses to avail benefits of extended timelines in view of Covid-19.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X