For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ నగదు ట్రాన్సాక్షన్స్ చేస్తే ఐటీ నోటీసులు రావొచ్చు

|

నగదు ట్రాన్సాక్షన్స్ తగ్గించడానికి ఆదాయపు పన్ను స్లాబ్, బ్యాంకు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్రోకరేజీ వంటి వివిధ పెట్టుబడి ప్లాట్‌ఫామ్స్ నిబంధనలను కఠినతరం చేశాయి. నగదు ట్రాన్సాక్షన్స్ నిర్దిష్ట పరిమితులు విధించాయి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశముంది.

ఒక వ్యక్తికి, సేవింగ్స్ ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి రూ.1 లక్ష. సేవింగ్స్ ఖాతాలో రూ.1 లక్షకు మించి జమ చేస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపించవచ్చు. అదే విధంగా కరెంట్ అకౌంట్ హోల్డర్స్, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడు ఐటీ శాఖ నోటీసుకు బాద్యత వహించాలి.

These cash transactions can attract IT notices you

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే సమయంలో రూ.1 లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌లో నగదు డిపాజిట్ రూ.10 లక్షలు మించకూడదు. బ్యాంకు డిపాజిట్ ఒకరి బ్యాంకు FD ఖాతాలో అంతకుమించి నగదు డిపాజిట్ చేయవద్దు.

మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు నగదు పెట్టుబడిగా రూ.10 లక్షల పరిమితికి మించకుండా చూడాలి. ఆస్తిని కొనుగోలు చేసే సమయంలో లేదా విక్రయించే సమయంలో రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 లక్షల పరిమితికి మించి నగదు ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆదాయపు పన్ను శాఖకు సమాధానం చెప్పాలి.

English summary

ఈ నగదు ట్రాన్సాక్షన్స్ చేస్తే ఐటీ నోటీసులు రావొచ్చు | These cash transactions can attract IT notices you

These cash transactions can attract Income Tax notices you. Cash transactions that attract income tax notice.
Story first published: Sunday, July 25, 2021, 21:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X