For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాక్స్‌పేయర్స్‌కు ముఖ్యమైన అలర్ట్, జూన్ 7 నుండి కొత్త ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్

|

ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను మరింత ఈజీ చేయడంతో పాటు మొబైల్ ఫోన్‌లో ఉపయోగించుకునేలా ఈ-ఫైలింగ్ 2.0 కొత్త పోర్టల్ వస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వెబ్‌సైట్ స్థానంలో జూన్ 7వ తేదీ నుండి http:///incometax.gov.in అందుబాటులోకి రానుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇందులో ముందుగా పూర్తి చేసిన ఐటీ ఫామ్స్ ఉంటాయి. ఇ-ఫైలింగ్ 2.0 పోర్టల్‌లో కొత్త మొబైల్ యాప్ ఉండనుంది.

ఇందులో రిటర్న్స్‌ను ఎలా దాఖలు చేయాలనే అంశాలపై వీడియోలు, ఇతర సమాచారం ఉంటుంది. జూన్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ సేవలు అందుబాటులో ఉండటం లేదు. కొత్త పోర్టల్ కార్యకలాపాలు జూన్ 7వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.

FY22లో రూ.2000 కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ లేదు: ఆర్బీఐFY22లో రూ.2000 కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ లేదు: ఆర్బీఐ

అలవాటు పడటానికి కొంత సమయం

అలవాటు పడటానికి కొంత సమయం

పన్ను చెల్లింపుదారుల‌కు, డిపార్మెంట్ అసెస్సింగ్ ఆఫీసర్ మధ్య ఇప్ప‌టికే షెడ్యూల్ చేసిన ప‌నుల‌ను వాయిదా వేసే అవ‌కాశముందని, ప‌న్ను చెల్లింపుదారులు కొత్త పోర్ట‌ల్‌కు అల‌వాటుపడటానికి కొంత స‌మ‌యం ప‌డుతుందని, అందుకే జూన్ 10వ తేదీ తర్వాత నాటికి వీటిని వాయిదా వేసుకోవాలని తెలిపింది. వ్య‌క్తిగ‌త లేదా బిజినెస్ కేట‌గిరికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేసేందుకు, ట్యాక్స్ రిటర్న్స్ విష‌యంలో త‌లెత్తే స‌మస్య‌లు, ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించి ఇత‌ర ప‌నుల కోసం ప‌న్ను చెల్లింపుదారులు ఈ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌ను వినియోగిస్తారు.

ఫీచర్స్ మరింత ఫ్రెండ్లీగా

ఫీచర్స్ మరింత ఫ్రెండ్లీగా

కొత్త పోర్టల్‌కు సంబంధించి ఆదాయ పన్ను శాఖ నిన్న ట్వీట్ చేసింది. కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు మరింత సరళతరంగా ఉంటుందని, కొత్తగా ఇందులో పొందుపరిచిన ఫీచర్స్ మరింత ఫ్రెండ్లీగా ఉంటాయని వెల్లడించింది. పన్నుచెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ చేపట్టేలా దీనిని రూపొందించినట్లు CBDT తెలిపింది.

పేమెంట్ యాప్స్

పేమెంట్ యాప్స్

ఒకే డాష్‌బోర్డ్ మీద అన్ని రకాల అప్‌లోడ్స్, పెండింగ్స్ తెలుసుకునే ఈ కొత్త పోర్టల్ ఉంటుందని, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఇతర మల్టిపుల్ పేమెంట్ ఆప్షన్స్ పొందుపరిచినట్లు తెలిపింది. దీనివల్ల ట్యాక్స్‌పేయర్స్ త్వరితగతిన తమ అకౌంట్లను చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ట్యాక్స్ పేయర్స్‌కు హెల్ప్ డెస్క్ అసిస్టెన్స్ ఉంటుంది. అలాగే వివిధ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ సరికొత్త పోర్టల్ సురక్షితం. పలు లాగిన్ ఆప్షన్స్ ఉండటం దీని ప్రత్యేకత.

English summary

ట్యాక్స్‌పేయర్స్‌కు ముఖ్యమైన అలర్ట్, జూన్ 7 నుండి కొత్త ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ | Income Tax dept to launch new e portal for easier ITR filing methods

The Income Tax Department on Saturday said its new e-filing portal will be mobile friendly, have pre-filled ITR form and simplified utility.
Story first published: Sunday, May 30, 2021, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X