For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2022లో ముఖ్యమైన ఈ గడువులు గుర్తు పెట్టుకోండి: ఐటీఆర్, పాన్-ఆధార్ నుండి ముందస్తు పన్ను దాకా

|

ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను డిసెంబర్ 31, 2021లోగా దరఖాస్తు చేసుకోలేని వారికి మరో గడువు ఉంటుంది. అయితే ఇది జరిమానాతో కూడుకున్నది. కరోనా కారణంగా ఇప్పటికే గడువును పలుమార్లు పొడిగించి, గత నెల చివరి వరకు ఇచ్చారు. అయితే 2022 మార్చి 31వ తేదీ వరకు కూడా ఐటీ రిటర్న్స్‌ను సమర్పించవచ్చు. అయితే ఆలస్య రుసుము కింద రూ.1000 నుండి రూ.5000 జరిమానా ఉంటుంది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే 2022లోను పర్సనల్ ఫైనాన్స్, డెడ్ లైన్స్ ఉంటాయి. పెనాల్టీ లేదా జరిమానా పడకుండా ఉండేందుకు ఈ 12 డెడ్ లైన్స్‌ను గుర్తు పెట్టుకోవాలి. ఇందులో పాన్ - ఆధార్ లింకింగ్, ఐటీఆర్ లేట్ ఫైలింగ్, పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ వంటి అంశాలు ఉన్నాయి.

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్

2020-21(AY2021-22) ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చివరి తేదీ డిసెంబర్ 31, 2021. అయితే ఈ గడువును మిస్ అయిన వారికి మరో ఛాన్స్ ఉంటుంది. జనవరి 1, 2022 నుండి మార్చి 31, 2022 మధ్య ఫైల్ చేసుకోవచ్చు. అయితే పెనాల్టీ రూ.1000 నుండి రూ.5000 మధ్య ఉంటుంది.

ఇదే కాకుండా రివైజ్డ్ ఐటీ రిటర్న్స్‌ను కూడా మార్చి 31, 2022లోగా ఫైల్ చేయవచ్చు.

లైఫ్ సర్టిఫికెట్, ఆధార్-పాన్ లింకింగ్

లైఫ్ సర్టిఫికెట్, ఆధార్-పాన్ లింకింగ్

- పెన్షన్‌దారులు లైఫ్ సర్టిఫికెట్ దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2021. అయితే ప్రభుత్వం ఈ గడువును ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించింది.

- ఆధార్ కార్డు-పాన్ కార్డు లింకింగ్ గడువును మార్చి 31, 2022 వరకు పొడిగించారు. దీనిని లింక్ చేయకుంటే మీ పాన్ నెంబర్ ఇన్-ఆపరేటివ్ అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లేదా షేర్ల వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం కుదరదు. గడువు ముగిస్తే రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాలి.

బ్యాంకింగ్ KYC, ఐటీఆర్ వెరిఫికేషన్, అడ్వాన్స్ ట్యాక్స్

బ్యాంకింగ్ KYC, ఐటీఆర్ వెరిఫికేషన్, అడ్వాన్స్ ట్యాక్స్

- బ్యాంక్ అకౌంట్ KYCని ఆర్బీఐ డిసెంబర్ 31, 2021 నుండి మార్చి 31, 2022 వరకు పొడిగించింది. బ్యాంకులు ఖాతాదారులకు ఉపశమనమిస్తూ గడువులోగా ట్రాన్సాక్షన్స్ మరియు ఉపసంహరణలను అనుమతించాయి.

- 2019-20 ఐటీఆర్-వి వెరిఫికేషన్‌ను పూర్తి చేయనివారు ఫిబ్రవరి 28, 2022లోగా పూర్తి చేయాలి. 2021తో ముగిసినప్పటికీ ఆర్బీఐ ఒకసారి వెసులుబాటును కల్పించింది.

- 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ గడువు మార్చి 15, 2022. ఈ తేదీలోగా వంద శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్‌లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ద్వారా వచ్చే డివిడెండ్ ఇన్‌కంను కూడా యాడ్ చేయాలి. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రం అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ నుండి మినహాయింపు ఉంది.

డెబిట్/క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్

డెబిట్/క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్

- డెబిట్ లేదా క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ గడువును ఆర్బీఐ ఇటీవల డిసెంబర్ 31వ తేదీ నుండి జూన్ 30, 2022కు పొడిగించింది. అంటే ఆన్ లైన్ కొనుగోలు సమయంలో కస్టమర్లను ప్రతిసారి 16 డిజిట్ కార్డు నెంబర్‌ను అడుగుతారు. డేటా ప్రైవసీలో భాగంగా దీనిని తీసుకు వచ్చారు.

- 2021-22 (AY2022-23) ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ ఫైల్ చేయడానికి గడువు జూలై 31, 2022. ఈ గడువు దాటితే రూ.5000 పెనాల్టీ చెల్లించాలి.

- మార్చి 31, 2022లోగా ట్యాక్స్ సేవింగ్ ఎక్సర్‌సైజ్ పూర్తి చేయాలి. మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ప్రీమియం, ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ వంటివి ఉంటాయి.

- 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 15వ తేదీలోగా అడ్వాన్స్ ట్సాక్స్ పేమెంట్స్ చేయాలి. రెండో ఇన్‌స్టాల్‌మెంట్ గడువు సెప్టెంబర్ 15, 2022. ఈ తేదీలోగా ఇండివిడ్యువల్స్ 45 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. డిసెంబర్ 15వ తేదీలోగా 75 శాతం చెల్లించాలి.

English summary

2022లో ముఖ్యమైన ఈ గడువులు గుర్తు పెట్టుకోండి: ఐటీఆర్, పాన్-ఆధార్ నుండి ముందస్తు పన్ను దాకా | From belated income tax return to PAN-Aadhaar linking

It’s 2022 and like every year, there are personal finance deadlines that one needs to comply with. As of now, there are 12 deadlines that one needs to remember in order to avoid penalties.
Story first published: Monday, January 3, 2022, 14:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X