For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళికి బహుమతులు అందుకున్నారా? అయితే ఇది తెలుసుకోండి

|

దీపావళికి ఉద్యోగులకు కార్యాలయాల్లో బహుమతులు లేదా బోనస్‌ల లభిస్తాయి. లేదా బంగారం, వాహనం, గిఫ్ట్ వోచర్లను బహుమతిగా అందుతాయి. చిన్న ఉద్యోగుల నుండి పెద్ద ఉద్యోగుల వరకు వారివారి స్థాయిల్లో చిన్న బహుమతుల నుండి ఇళ్లు, కార్లు వంటి బహుమతులు కూడా అందుతాయి. అలాగే, ఈ పండుగ సందర్భంగా మీ కుటుంబం.. బంధువులు లేదా స్నేహితులతో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం తెలిసిందే. ఇందులో ఇల్లు లేదా కారు లేదా బంగారం వంటి బహుమతులు కూడా ఉంటాయి. దీపావళి పండుగకు ఇప్పటికే చాలామంది బహుమతులు అందుకొని ఉంటారు. అయితే వీటిపై పన్నులు ఎలా పడతాయో తెలుసుకోవడం అవసరం. మీరు స్వీకరించే బహుమతులు అన్నీ పన్నురహితంగా ఉండకపోవచ్చు. వాటిలో కొన్నింటి పైన పన్నులు చెల్లించవలసి వస్తుంది.

ప్రోత్సాహక బహుమతిగా..

ప్రోత్సాహక బహుమతిగా..

ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం నగదు రూపంలో అందుకునే బోనస్‌ను వేతన ఆదాయంగా పరిగణిస్తారు. ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. మీ స్లాబ్ రేటు ప్రకారంగా పన్ను ఉంటుంది. ఈ బోనస్‌కు ప్రత్యేక పన్ను మినహాయింపులు ఉండవు. నగదు బోనస్‌ను వేతన ఆదాయంగా పరిగణిస్తారు. కాబట్టి పన్ను చెల్లింపుదారు నగదు బోనస్ పైన స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐటీ చట్టం 3(7)(4) నిబంధనల ప్రకారం ఏదేని ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నుండి అందుకున్న బంగారం, వాహనం లేదా వోచర్స్ వంటి మొత్తం వ్యాల్యూ రూ.5000 మించితే పన్ను వర్తిస్తుంది. ఐటీ రిటర్న్స్‌ల్లో శాలరీ హెడ్‌లో బహుమతి వ్యాల్యూను ప్రోత్సాహకంగా చూపించాలి.

బహుమతి తీసుకున్న వారు పన్ను

బహుమతి తీసుకున్న వారు పన్ను

నగదు, వెండి, బంగారు ఆభరణాలు, పేయింటింగ్స్, అలంకరణ సామాగ్రి, మ్యూచువల్ ఫండ్స్, FD లేదా ఇతర ఆర్థిక సాధనాలు ఏవైనా రూ.50వేలు మించితే ఐటీ శాఖకు వెల్లడించాలి. ఆదాయపు పన్ను చట్టం 56(2) కింద ఆర్థిక సంవత్సర కాలంలో వచ్చిన బహుమతులను ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు. కాబట్టి వీటిపై ట్యాక్స్ పడుతుంది. ఆస్తి వ్యాల్యూను పరిగణలోకి తీసుకోకుండా, స్థిరాస్తిని బహుమతిగా తీసుకుంటే కనుక స్టాంప్ డ్యూటీ వ్యాల్యూ రూ.50,000 దాటితే ఆదాయపు పన్ను విధిస్తారు. అయితే స్థిరాస్తిని తగిన పరిగణనతో బదలీ చేసిన సందర్భంలో స్టాంప్ డ్యూటీ వ్యాల్యూ రూ.50,000 మించి ఉంటే పన్ను విధిస్తారు. అలాగే సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే క్యాష్ బహుమతులు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. బహుమతి తీసుకున్నవారు పన్ను చెల్లించాలి.

ఇవి మినహాయింపు

ఇవి మినహాయింపు

ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం బంధువుల నుండి తీసుకునే బహుమతులు పన్ను పరిధిలోకి రావు. అంటే భార్యాభర్తలు, సంతానం, తల్లి లేదా తండ్రి తరఫువాళ్లు ఇచ్చే బహుమతులు పన్నుల పరిధిలోకి రావు. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యుల నుంచి తీసుకునే బహుమతులకు పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే పెళ్లి సందర్భంగా వచ్చే బహుమతులు, వంశపారంపర్యంగా సంక్రమించే బహుమతులు కూడా పన్ను పరిధిలోకి రావు.

English summary

దీపావళికి బహుమతులు అందుకున్నారా? అయితే ఇది తెలుసుకోండి | Do you need to pay tax on Diwali gift?

Diwali, the festival of lights, is an occasion where you exchange cash or gifts with your family and friends and spread positive vibes to your loved ones.
Story first published: Sunday, November 7, 2021, 9:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X