English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ముద్రా రుణాలు పొందాల‌నుకుంటున్నారా? అయితే ఇవి చ‌ద‌వండి

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి కోసం మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముద్రా (ప్రధాన మంత్రి మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన కింద రుణాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ 'ముద్ర' యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల దాకా ఋణాలను అందిస్తుంది. ప్ర‌భుత్వం ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నా కిందిస్థాయిలో అవ‌గాహ‌న లేని మూలంగా వాటి ప్ర‌యోజ‌నాల‌ను చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల వ్య‌వ‌స్థాప‌కులు అందుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ముద్రా యోజ‌న గురించి స‌మ‌గ్ర స‌మాచారం మీ కోసం.

1.ముద్రా రుణం పొందుటకు అర్హత:

1.ముద్రా రుణం పొందుటకు అర్హత:

భారత పౌరుడై ఉండాలి,

ఒక వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగ ఉండాలి,

ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగాల్లో మీ ప‌రిశ్ర‌మ‌, ఆలోచ‌న ఉండొచ్చు.

రుణ అవసరం రూ.10 లక్షల లోపు ఉండాలి.

పైన పేర్కొన్న అర్హత గల వారు దగరలో వున్నబ్యాంక్, సూక్ష్మ ఋణ సంస్థ (ఎంఎఫ్‌ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) అధికారులను సంప్రదించాలి.

2. మూల‌ధ‌నం:

2. మూల‌ధ‌నం:

దేశంలో 58 మిలియన్ నాన్ కార్పొరేట్ సంస్థలు 128 మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. వాటిలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిలో 40 శాతానికి పైబడి వెనుకబడిన తరగతులు, 15 శాతం షెడ్యూల్డ్ కులాలు, జాతుల పారిశ్రామికుల యాజమాన్యంలో ఉన్నాయి. కాని ఆయా సంస్థలకు బ్యాంకుల ద్వారా అందిన ఆర్థిక సహాయం నామమాత్రమే. వారిలో చాలా మందికి బ్యాంకు రుణాలు అందుబాటులో లేవు. మరో మాటలో చెప్పాలంటే, అత్యధిక ఉపాధి అవకాశాలు అందిస్తున్న రంగానికి అతి తక్కువ స్థాయిలో రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన, ముద్ర బ్యాంకులను ప్రారంభించింది.

3. ముద్రా రుణం అంటే ఏమిటి?

3. ముద్రా రుణం అంటే ఏమిటి?

వ్య‌వ‌సాయేత‌ర రంగాలైన త‌యారీ, వాణిజ్యం, సేవా రంగాల్లో రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కూ ప్ర‌భుత్వం క‌ల్పించే రుణ‌మే ముద్రా రుణం. ఈ ర‌క‌మైన రుణాల‌ను ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్ర‌యివేటు బ్యాంకులు, స‌హ‌కార బ్యాంకుల నుంచి పొంద‌వ‌చ్చు. ప్ర‌ధాన మంత్రి ముద్రా యోజ‌న కింద ఈ రుణాల‌ను అంద‌జేస్తారు.

వీటితో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ రుణ సంస్థ‌లు సైతం రుణాల‌నందించేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. అయితే ఇందుకోసం అవి కొన్ని అర్హ‌త ప్ర‌మాణాల‌ను పాటించాల్సి ఉంటుంది.

మొత్తంగా చూస్తే 27 ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, 17 ప్రైవేటు రంగ బ్యాంకులు, 27 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 25 సూక్ష్మ రుణ సంస్థ‌ల నుంచి ల‌బ్దిదారులు రుణాల‌ను తీసుకోవ‌చ్చు.

4. ముద్రా రుణ రకాలు:

4. ముద్రా రుణ రకాలు:

ఫండింగ్ దశను బట్టి ‘శిశు', ‘కిశోర్', ‘తరుణ్' పేరిట మూడు రకాల పథకాల కింద ముద్ర యోజన నిధులు సమకూర్చుతుంది.

శిశు: రూ. 50,000 లోపు రుణాలు

కిశోర్: రూ. 50 వేల పైన రూ. 5 లక్షల దాకా

తరుణ్: రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వ‌ర‌కూ

5. ఎలా సంప్ర‌దించాలి?

5. ఎలా సంప్ర‌దించాలి?

మీ ప్రాంతంలో ఉండే బ్యాంకు శాఖ‌కు వెళ్లి ముద్రా రుణం కోసం అభ్యర్థించాలి. అర్హ‌త ప్ర‌మాణాల‌ను చెక్ చేసిన త‌ర్వాత రుణాల‌ను అందిస్తారు. ముద్రా రుణాల‌కు సంబంధించి 97 నోడ‌ల్ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేశారు. నోడ‌ల్ కార్యాల‌యాల మెయిల్ ఐడీ, ఫోన్ నంబ‌ర్ల‌ను పై చిత్రంలో చూడ‌వ‌చ్చు.

ముద్రా రుణ ద‌ర‌ఖాస్తు ఫారం లింక్‌

6. ముద్రా ఇంత‌వ‌ర‌కూ ఏం సాధించింది.

6. ముద్రా ఇంత‌వ‌ర‌కూ ఏం సాధించింది.

మార్చి 31, 2016 నాటికి ఉన్న స‌మాచారం ప్ర‌కారం 2015-16లో ముద్రా యోజ‌న కింద 3,48,80,924 ల‌బ్దిదారుల‌కు రుణాల‌ను మంజూరు చేశారు. ఇందుకోసం మొత్తం 1,37,449 కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌గా మార్చి 31 నాటికే రూ. 132954 కోట్ల పంపిణీ పూర్త‌యింది.

7. ఈ ప‌థ‌కం వ‌ర్తించే రంగాలు

7. ఈ ప‌థ‌కం వ‌ర్తించే రంగాలు

రోడ్డు ర‌వాణా: -

ఆటోరిక్షా, చిన్న వస్తువులు రవాణా వాహనం, 3 వాహనాలు, ఇ-రిక్షా ప్యాసింజర్ కార్లు, టాక్సీలు, మొదలైనవి వస్తువులు మరియు వ్యక్తిగత రవాణా కోసం రవాణా వాహనాల కొనుగోలు.

కమ్యూనిటీ, సామాజిక మరియు వ్యక్తిగత సేవలు కార్యక్రమాలు : -

బ్యూటీ పార్లర్స్, వ్యాయామశాల, షాపులు, టైలరింగ్ దుకాణాలు, డ్రై క్లీనింగ్, చక్రం మరియు మోటార్ సైకిల్ మరమ్మతు దుకాణం, డిటిపి మరియు ఫోటో సౌకర్యాలు, మెడిసిన్ దుకాణాలు, కొరియర్ ఏజెంట్లు, మొదలైనవి.

ఆహార ఉత్పత్తుల రంగం: -

పాపడ్(అప్ప‌డాల‌) తయారీ, పచ్చడి తయారీ, జామ్ / జెల్లీ తయారీ, వ్యవసాయ ఉత్పత్తులకు పరిరక్షణకు గ్రామీణ స్థాయి, తీపి దుకాణాలు, చిన్న సేవ ఆహారం స్టాళ్లు మరియు రోజు క్యాటరింగ్ / రోజువారి క్యాటరింగ్ సేవలకు, కోల్డ్ స్టోరేజ్, ఐస్ & ఐస్ క్రీమ్ తయారీ యూనిట్లు, బిస్కట్, రొట్టె మరియు బన్ను తయారీ మొదలైనవి.

వస్త్ర ఉత్పత్తుల రంగం: -

చేనేత, ప్రజలకు చికన్ పని, జరీ మరియు జర్దారీ పని, సంప్రదాయ ఎంబ్రాయిడరీ మరియు చేతిపని, సంప్రదాయ అద్దకం మరియు ప్రింటింగ్, దుస్తులు డిజైన్, అల్లడం, పత్తి జిన్నింగ్, కంప్యూటరీకరణ ఎంబ్రాయిడరీ, కలపడం మరియు ప్రయత్నంగా కార్యక్రమాలకు మద్దతు అందించడానికి ఉత్పత్తులైన బ్యాగులు, వాహనం ఉపకరణాలు, మొదలైనవి.

8. ఋణము పొందు విధానం మరియు కావాల్సిన ప‌త్రాలు:

8. ఋణము పొందు విధానం మరియు కావాల్సిన ప‌త్రాలు:

ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) కింద సహాయం పొందగోరేవారు వారి ప్రాంతంలో ఆర్థిక సంస్థల ఏ యొక్క స్థానిక శాఖ అధికారులనైనా సంప్రదించవచ్చును, ప్ర‌భుత్వ ర‌గం బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సేలందించే ఇన్స్టిట్యూషన్స్ (MFI) మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC). సాయం మంజూరు సంబంధిత రుణ సంస్థల అర్హత నిబంధనలను ప్రకారం ఉండాలి.

వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం: ఓటరు ఐడి కార్డ్ / డ్రైవింగ్ లైసెన్సు / పాన్ కార్డు / ఆధార్ కార్డు / పాస్పోర్ట్ / ప్రభుత్వంచే జారీచేయబడిన ఫోటో ఐడీ ధృవీకరణ మొదలైనవి.

నివాస గుర్తింపు: ఇటీవలి టెలిఫోన్ బిల్లు / విద్యుత్ బిల్లు / ఆస్తి పన్ను రసీదు (చివరి 2 నెలల లోపువి) / ఓటరు ఐడి కార్డ్ / వ్యక్తిగత / ప్రొప్రైటర్ / భాగస్వాములు బ్యాంక్ ఖాతా పుస్తకము లేదా తాజా ఖాతా స్టేట్మెంటు, ఆధార్ కార్డ్ / పాస్పోర్ట్ వెంటనే బ్యాంక్ అధికారులు / నివాస సర్టిఫికెట్ ద్వారా ధృవీకరణ / సర్టిఫికెట్ ప్రభుత్వం జారీ చేసింది, అధికారం / స్థానిక పంచాయితీ / మున్సిపాలిటీ మొదలైనవి.

ఇవి కూడా చ‌ద‌వండి అమ్మో! న‌ల్ల‌ధనాన్ని ఈ విధంగా మార్చుతున్నారా?

English summary

What is the mudra yojana and how to get mudra Loan

The Prime Minister Shri Narendra Modi on 8th april 2015 launched the Micro Units Development and Refinance Agency Ltd. called as MUDRA Bank at a function at Vigyan Bhavan in the national capital.All Micro-finance Institutions (MFIs) which are in the business of lending to micro / small business entities can give loans to small businesses upto 10 lakh rupees.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC