For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఘనత సాధించిన మూడో భారత ఐటీ సంస్థగా విప్రో: 3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్

|

ముంబై: ప్రముఖ భారత ఐటీ సంస్థ విప్రో గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రూ. 3 ట్రిలియన్‌ను తాకింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ తర్వాత ఈ మైలురాయిని సాధించిన మూడో భారత ఐటీ కంపెనీగా విప్రో నిలిచింది. మార్కెట్ ప్రారంభంలో విప్రో స్టాక్ ధర రూ. 550 తాకింది.

బీఎస్ఈలో అంతకుముందు రోజు రూ. 543.05 వద్ద ముగిసింది. ప్రస్తుతం విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3.01 ట్రిలియన్. మింట్ నివేదిక ప్రకారం.. థియరీ డెలాపోర్ట్ సంస్థ సీఈవో, ఎండీగా చేరినప్పటి నుంచి విప్రో స్టాక్ పెరిగింది.

Wipro hits ₹3 trillion in market capitalisation

డెలాపోర్ట్ నాయకత్వంలో జర్మనీ రిటైలర్ మెట్రో నుంచి ఈ సంస్థ 7.1 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఒప్పందాన్ని చేసుకుంది. కాగా, మనదేశంలో మొత్తం దీని పేరిట 13 లిస్ట్‌డ్ సంస్థలున్నాయి. ఇవన్నీ కలిపి రూ. 3 ట్రిలియన్ ఎం క్యాంప్ ను దాటాయి.

విప్రో వాటా కేవలం ఒక సంవత్సరంలోనే 157 శాతం పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 40 శాతం పెరిగింది. ఒక నెలలో విప్రో స్టాక్ 11.44 శాతం పెరిగింది.

రూ. 14.05 శాతం ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్, రూ, 11.58 మార్కెట్ క్యాపిలైజేషన్‌తో ట్రిలియన్ టాటా కన్సల్టేషన్‌ సర్వీసెస్ లిమిటెడ్, రూ. 8.33 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలో అత్యంత విలువైన సంస్థలుగా ఉన్నాయి. తాజాగా విప్రో ఈ జాబితాలో చేరింది. విప్రో మార్కెట్లో క్యాపిటలైజేషన్ పరంగా దేశం మొత్తంలో 14వ స్థానంలో ఉంది.

English summary

ఆ ఘనత సాధించిన మూడో భారత ఐటీ సంస్థగా విప్రో: 3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ | Wipro hits ₹3 trillion in market capitalisation

Wipro Ltd on Thursday touched ₹3 trillion in market capitalisation for the first time, and became the third Indian IT firm to achieve this milestone.
Story first published: Thursday, June 3, 2021, 17:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X