ముంబైలోని ప్రసిద్ధ పరేల్ ప్రాంతంలో ఉన్న ఒక 2BHK అపార్ట్‌మెంట్ కోసం ఇద్దరు యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నెలకు రూ. 1 లక్ష అద్దె చెల్లిస్తున్నట్లు చూపించిన వైరల్ వీడియో* ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్య కొఠారి షేర్ చేశారు. ఇందులో యువ జంట తమ అపార్ట్‌మెంట్‌ను వీక్షకులకు టూర్‌గా చూపిస్తూ వివరిస్తారు. వీడియోలో అపార్ట్‌మెంట్ సుమారు 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని.. రెండు పడకగదులు, లివింగ్ రూమ్, మాస్టర్ బెడ్‌రూమ్ వంటి ప్రత్యేకతలను చూపించారు.
అపార్ట్‌మెంట్ టూర్ ప్రారంభంలో.. ఇంటి యజమాని వీక్షకుల ప్రశ్నకు సమాధానంగా..ముంబైలో మీరు అద్దెకు ఎంత చెల్లిస్తారని అడిగినప్పుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మేడం సుమారు లక్ష రూపాయలూ అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ అద్దెతో మాత్రమే కాదు, నిర్వహణ ఛార్జీలు కూడా ఉంటాయని తెలిపారు.

వీరి నివాస స్థలం పరేల్‌లోని ఎత్తైన భవనాలు, ప్రధాన వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉందని, విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే దృశ్యాన్ని కూడా కిటికీ ద్వారా చూడగలమని, వీరు తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారు. ఇంట్లో ఎక్కువ సమయం లివింగ్ రూమ్‌లో గడుపుతామని, అక్కడ క్రీయాశీల చర్చలు, కెరీర్ సలహాలు జరిగుతాయని చెప్పారు.
23 ఏళ్ల వయసులో ముంబైలో నివసిస్తున్న వీరు.. అద్దె ఎక్కువగా ఉన్నప్పటికీ సోబోలో ఉండటం అవసరమని, ఇది అనుకూలమైన ప్రాంతం అని తెలిపారు. అయితే ముంబైలో నివసించడంలో అతిపెద్ద సవాలు ప్రయాణ దూరాలు. ముఖ్యంగా బాంద్రా వంటి ప్రాంతాలకు వెళ్లడం చాలా కష్టమని అన్నారు.
వైరల్ వీడియోపై ఇంటర్నెట్ ప్రతిచర్యలు అదే స్థాయిలో వచ్చాయి. ఒక యూజర్ 1 లక్ష? రెంటా.. ఈ డబ్బుతో EMI పెట్టుకుని నాసిక్‌లో 2 ఇళ్లను కొనాలని అనుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. మరొకరు విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ చూడటానికి చాలా మంచి ప్రదేశం అని పేర్కొన్నారు. మూడవ వ్యక్తి 23 ఏళ్ల వ్యక్తి నెలకు 1 లక్ష అద్దె చెల్లిస్తున్నాడని ఆశ్చర్య వ్యక్తం చేశారు. మరొకరు 1 లక్ష అద్దెతో మెయిన్ బోరివాలి మే దే రహా హన్, నేను నా బ్రోకర్‌ను మార్చాలని చమత్కరించారు.
నా నెలవారీ జీతం వారి అద్దె కంటే తక్కువగా ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ వీడియో ముంబై అద్దె మార్కెట్ లో ఉన్న భారీ పెరుగుదలను చూపిస్తోంది. యువత, మధ్యతరగతి వర్గానికి ఎదురయ్యే కష్టాలను చర్చించడానికి ఇది వైరల్ చర్చను అందించింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications