For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్! NPSలో అందరికీ పన్ను మినహాయింపు, కేంద్రానికి సిఫార్సు

|

నేషనల్ పెన్షన్ స్కీం(NPS) కింద నమోదైన అన్ని విభాగాల చందాదారుల యాజమాన్య వాటాకు (14 శాతం) వచ్చే బడ్జెట్‌లో పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తాము ప్రభుత్వానికి నివేదించామని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) చైర్మన్ సుప్రతిమ్ బందోపాద్యాయ తెలిపారు. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు NPS కింద యాజమాన్య చందా.. పద్నాలుగు శాతం భవిష్యత నిధికి పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనిని NPS కింద నమోదైన రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఇతర కార్పోరేట్ సంస్థల చందాదారులకు కూడా వచ్చే 2021-22 బడ్జెట్ నుండి వర్తింప చేయాలని సుప్రతిమ్ తెలిపారు.

కంపెనీలకు పీఎఫ్ గుడ్‌న్యూస్.. రెండేళ్లపాటు ఈపీఎఫ్‌ను మోడీ ప్రభుత్వమే ఇస్తుంది.. వివరాలివీ...కంపెనీలకు పీఎఫ్ గుడ్‌న్యూస్.. రెండేళ్లపాటు ఈపీఎఫ్‌ను మోడీ ప్రభుత్వమే ఇస్తుంది.. వివరాలివీ...

NPS వైపు మొగ్గు

NPS వైపు మొగ్గు

NPS పెట్టుబడులకు ఎంతో అనువైనదిగా భావిస్తుండటంతో చాలామంది ఖాతాదారులు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. 2004లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. 2009లో ఇందులో అందరికీ పెట్టుబడులు పెట్టే అవకాశమిచ్చారు. 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల వారు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ పథకంలో ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలు తమ పెన్షన్ నిధుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దాదాపు 7,900 కార్పొరేట్లు NPSలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పథకం ఆధారంగా 9 శాతం నుంచి 12 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పెట్టుబడుల ఆధారంగా పెన్షన్ వస్తుంది. NPSలో పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. NPSలో ఖాతాను తెరిచేందుకు పెద్దగా ధ్రువపత్రాలు అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డుతో ఆన్‌లైన్ ద్వారా ఈ-ఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌ ద్వారా అకౌంట్ తెరువవచ్చు.

టైర్-2 NPS అకౌంట్లకూ పన్ను మినహాయింపు

టైర్-2 NPS అకౌంట్లకూ పన్ను మినహాయింపు

చందాదారులందరికీ NPS పన్ను ప్రయోజనం అందించాలనేది తమ ఉద్దేశ్యమని సుప్రీతమ్ తెలిపారు. ఈ ప్రయోజనాల్ని తమకూ వర్తింపజేయాలని కోరుతూ PFRDAకు లేఖలు వచ్చినట్లు తెలిపారు. 2021-22 బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, చందాదారులందరికీ టైర్ 2 NPS అకౌంట్లను కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి తీసుకు రావాలని కోరుతున్నట్లు సుప్రీతమ్ తెలిపారు.

ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం

ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనం

ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టైర్ 2 NPS ప్రయోజనాన్ని అందించింది. ట్యాక్స్ ఫ్రీ టైర్ 2 అకౌంట్లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. పన్నురహిత హోదా ఇందుకు కారణం. ఉద్యోగులందరికీ ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని కోరుతున్నట్లు సుప్రీతమ్ తెలిపారు. NPS కింద టైర్ 2 అకౌంట్ తప్పనిసరి అకౌంట్ కాదు. దీనిని టైర్ 1 అకౌంట్‌తో పాటు ఎంచుకోవచ్చు. తక్షణం విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

English summary

గుడ్‌న్యూస్! NPSలో అందరికీ పన్ను మినహాయింపు, కేంద్రానికి సిఫార్సు | Will ask government to make employers contribution tax free in Budget: PFRDA

Pension Fund Regulatory and Development Authority (PFRDA) Chairman Supratim Bandyopadhyay has said that PFRDA will propose to the government to make employers' contribution of 14 per cent under NPS tax free for all categories of subscribers in the next Budget.
Story first published: Monday, November 16, 2020, 8:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X