For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్‌లోన్ త్వరగా తీర్చేయలా.... లేదంటే ఏం జరుగుతుంది?

|

సొంత ఇంటి కల లేని వారు ఎవరు? ఎలాంటి ఆదయ వర్గాల వారైనా ఎదో ఒకటి సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. అందుకే పైసా పైసా కూడబెట్టి సమయం వచ్చినప్పుడు ఇల్లు కొనాలని భావిస్తారు. కానీ ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిణామాల మధ్య రియల్ ఎస్టేట్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. జనాభా పెరిగిపోతోంది. కానీ భూమి మాత్రం పెరగదు. అందుకే భూముల ధరలకు రెక్కలు వస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో సామాన్యుడు ఒక సొంత ఇల్లు కొనాలంటే హీన పక్షం రూ 25,00,000 ఖర్చవుతుంది. సౌకర్యాలను బట్టి రూ కోట్ల లో ధరలు పలుకుతాయి. ప్రస్తుతం హైదరాబాద్ వంటి మహా నగరంలో అయితే కనీసం రూ 50,00,000 లేనిదే సొంత ఇల్లు సాధ్యం కాదు. అది కూడా కేవలం ఫ్లాట్ మాత్రమే.

ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే సిటీ శివార్లకు వెళ్లాల్సిందే. అంత డబ్బు నూటికి తొంభై శాతం మంది దగ్గర ఉండదు. చాలా కాలంగా చిట్టీలు వేసి, బ్యాంకులో దాచి, పీఎఫ్ విత్ డ్రా చేసి ఏదో ఒక రూ 25,00,000 లక్షలు జమ చేసి మరో రూ 25,00,000 లక్షలు హోమ్ లోన్ తీసుకుందామని సిద్ధమవుతారు. బ్యాంకును సంప్రదిస్తే... సదరు వ్యక్తి వార్షిక ఆదాయం బేస్ చేసుకుని వారికి ఎలిజిబిలిటీ ఉన్నదీ లేనిదీ చెబుతారు. ఒక వేళ ఎలిజిబిలిటీ ఉంటె హోమ్ లోన్ మంజూరు చేస్తారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ దాన్ని తిరిగి చెల్లించేప్పుడే తెలుస్తుంది దాని బాధ ఏమిటో...

SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్‌లోన్ స్కీం: ప్రయోజనమెలా?

రుణానికి రెట్టింపు చెల్లింపు...

రుణానికి రెట్టింపు చెల్లింపు...

మనం తీసుకునే హోమ్ లోన్ సుమారు రూ 25,00,000 అనుకుంటే... దానిని కనీసం 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా బ్యాంకు ఈఎంఐ సదుపాయం కల్పిస్తుంది. రుణంపై సుమారు 8% వడ్డీ రేటు అనుకుంటే... 20 ఏళ్లలో మనం కేవలం వడ్డీ కోసమే రూ 25,20,000 చెల్లిస్తాం. అసలు రూపంలో మరో 25,00,000 చెల్లిస్తాం. అంటే మొత్తంగా రూ 50,20,000 అవుతుంది. ఇక నెల వాయిదా సుమారు రూ 21,000 వరకు ఉంటుంది. ఈ లెక్కలు చూసినప్పుడే మనకు ఒక ఐడియా వస్తుంది. అనవసరంగా మనం బ్యాంకునకు పెద్ద మొత్తంలో వడ్డీ చెల్లిస్తున్నాం కదా. 20 ఏళ్ళ ఈ రుణాన్ని ఏ 10 ఏళ్ళ లోపే చెల్లిస్తే బెటర్ అని అనిపిస్తుంది చాలా మందికి. ఒకవేళ మన సంపాదన మెరుగ్గా ఉంటే అలాగే చేస్తాం కూడా. కానీ అది కరెక్టా కాదా తెలుసుకుందాం.

అసలు కంటే కొసరు అధికం...

అసలు కంటే కొసరు అధికం...

అసలు ... కొసరు అనేది ఒక సామెత అయినా... ఇక్కడ మనకు చక్కగా సరిపోతుంది. మనం గృహ ఋణం తీసుకున్నప్పుడు బ్యాంకు ఏం చేస్తుందో తెలుసా? తొలి 10 ఏళ్ళ పాటు మన నెలవారీ వాయిదాలో అసలు కంటే వడ్డీని అధికంగా ఉండేలా చూస్తుంది. మొదటి ఏడాది మన ఈఎంఐ రూ 21,000 లో అసలు రూ 1,000 ఉంటే ... వడ్డీ రూ 20,000 ఉంటుంది. ఇది ప్రతి ఏటా సవరణకు గురవుతుంది. అందుకే చాలా మంది వినియోగదారులు ఓ ఐదారేళ్లు హోమ్ లోన్ చెల్లించిన తర్వాత ఉత్సుకత కొద్దీ బ్యాంకుకు వెళ్లి 'మా హోమ్ లోన్ ఎంత వరకు తీరింది' అని ప్రశ్నిస్తారు. అప్పుడు బ్యాంకర్ చెప్పేది విని నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఐదేళ్లు కట్టిన తర్వాత కూడా రూ 1 లక్ష కూడా అసలు తగ్గదు. అప్పుడే మనకు అనిపిస్తుంది ఎందుకు తీసుకున్నమురా ఈ లోను అని! ఎలాగైనా తొందరగా తీర్చేస్తే బెటర్ ఏమో అని కూడా అనిపించి తెలిసిన వారిని అందరినీ ఓ మాట అడుగుతాం. ఒక్కోరు ఒక్కో సలహా ఇచ్చి మనల్ని మరింత కన్ఫ్యూజ్ చేస్తారు.

కంటిన్యూ చెయ్యాలి...

కంటిన్యూ చెయ్యాలి...

మనకు వచ్చిన కోపం, అసహనం సరైనదే అయినా... హోమ్ లోన్ విషయంలో మాత్రం మనం వెంటనే దానిని తిరిగి చెల్లించే బదులు కంటిన్యూ చేస్తేనే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే టైం వేల్యూ మనీ అనే విషయాన్ని గమనించాలని వారు పేర్కొంటున్నారు. అంటే ఈ రోజు మనం చెల్లించే మొత్తం అధికంగా అనిపించినా... పదేళ్ల తర్వాత మనకు ఆ మొత్తం చాలా తక్కువ అవుతుందని అంటున్నారు.

ఆదయ పన్ను చట్టం లోనూ మనకు భారీ మొత్తంలో పన్ను అదా అవుతుంది కాబట్టి ... హోమ్ లోన్ కొనసాగించాలని చెబుతున్నారు. సెక్షన్ 80 సి లో రూ 1,50,000 వరకు హోమ్ లోన్ అసలు, సెక్షన్ 24 ప్రకారం రూ 2,00,000 వరకు వడ్డీ చెల్లింపు పై మినహాయింపు వర్తిస్తుంది. అంటే మీరు చెల్లించే మొత్తం నెలవారీ వాయిదా కూడా మీకు ఆదయ పన్ను నుంచి మినహాయింపును అందిస్తుంది. మరో వైపు ఇప్పుడు మీరు చెల్లించే వడ్డీ రేటు 8% ఉంటే... అది రూ 10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి సగటున 6% కూడా పడదని టాక్స్ నిపుణులు లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. సో... మీరు హోమ్ లోన్ విషయంలో ఎలాంటి భయాలకు లోనవకుండా దానిని కంటిన్యూ చేసి ప్రయోజనం పొందాలని వారు సలహా ఇస్తున్నారు. అదే సమయంలో తక్కువ కాలపరిమితికి తీసుకున్న ఎక్కువ వడ్డీ చెల్లించే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు రుణాలు వెంటనే చెల్లిస్తే బెటర్ అని చెబుతున్నారు.

English summary

What is the ideal time to repay your home loan?

What is the ideal time to repay your home loan? Should anybody pay it immediately to avoid an excessive interest rate? Experts say that long term home loan is better to be hold for availing income tax benefits while suggest to avoid holding high interest burden personal loans and credit card debt for better financial discipline.
Story first published: Monday, January 13, 2020, 19:04 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more