న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టులో గురువారం నిరాశ ఎదురైంది. జనవరి 23వ తేదీ లోగా రూ.1.47 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాలన్న ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇది ఈ రెండు టెల్కోలకు భారీ షాక్.

సుప్రీం కోర్టులో చేదు అనుభవం
సుప్రీం కోర్టు పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో లైసెన్స్ రుసుముకింద రూ.96,642 కోట్లు, స్పెక్ట్రం వినియోగం కింద రూ.55,054 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. టెలికమేతర ఆదాయాలను (AGR) కలిపి బకాయిలు లెక్కకట్టాలని గత ఏడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సమీక్షించాలని టెల్కోలు పిటిషన్లు దాఖలు చేయగా, తాజాగా చేదు అనుభవం ఎదురైంది.

ఎవరెంత చెల్లించాలంటే?
టెలికం విభాగం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఎయిర్‌టెల్ రూ.21,682 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.19,823 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.16,454 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.2,098 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.2,537 కోట్లు చెల్లించాలి. ఇతర టెలికం సంస్థలు కూడా ఏజీఆర్ కింద చెల్లించాల్సి ఉంది. టెలికం కంపెనీలపై వడ్డీ, ఫైన్ సరిగ్గానే విధించారని, దీనిపై తదుపరి వివాదం ఏమీ లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే టెలికం కంపెనీలు కట్టాల్సిన బకాయిలు లెక్కించి, చెల్లింపు గడువును నిర్ణయిస్తామని తెలిపింది.

ఊరటనివ్వండి..
ఆయా టెల్కోలు వడ్డీలు, అపరాధ రుసుములు కలిపి మొత్తం రూ.92,641 చెల్లించాలి. వీటికి తోడు మరో రూ.55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కలిశాయి. మొత్తం రూ.1.47 లక్షల కోట్లు చెల్లించవలసి వచ్చింది. అయితే అపరాధ రుసుము, వడ్డీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని టెల్కోలు కోరుతున్నాయి.

క్యురేటివ్ పిటిషన్
సుప్రీం కోర్టు తీర్పు తమకు నిరాశ కలిగించిందని, దీనిపై క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ప్రకటించాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications