ఐదు కంపెనీలపై అమెరికా లాసూట్ వేసింది. విదేశాల నుంచి అమెరికా కస్టమర్లకు కోట్ల సంఖ్యలో మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపిస్తూ ఐదు కంపెనీలు, ముగ్గురు వ్యక్తులపై అగ్రదేశం కేసులు నమోదు చేసింది. అమెరికా వినియోగదారులకు లక్షలాది ఫేక్ రోబోకాల్స్ వస్తున్నాయని తెలిపింది. ఈ కారణంగా ఫైనాన్షియల్‌గా నష్టం జరుగుతోందని పేర్కొంది.

రోబో కాల్స్ నియంత్రణకు ఆదేశాలు..
ఇలా వస్తున్న ఫేక్ కాల్స్‌లలో భారత్ నుంచి ఎక్కువగా వస్తున్నాయని, దీంతో అమాయక ప్రజలకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోందని తెలిపింది. ఈ తరహా కాల్ సెంటర్లు, రోబో కాల్స్ నియంత్రణకు ఆదేశాలు జారీ చేయాలని అమెరికా లాసూట్లో పేర్కొంది.

హెచ్చరించినా అదే తీరు
ప్రభుత్వానికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి కస్టమర్లను తప్పుదారి పట్టిస్తూ మోసపూరిత రోబోకాల్స్ చేయవద్దని గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆ కంపెనీలు అదే పద్ధతిని కొనసాగిస్తున్నాయని పేర్కొంది. విదేశీ ఆధారిత మోసపూరిత పథకాలతో అమెరికా వినియోగదారులను ఆకర్షించడం ఇక మానివేయాలని హితవు పలికింది.

వీటిపై కేసులు
'ఈ కాల్స్ ఎక్కువగా భారత్ నుంచి వస్తున్నాయి. వీటి వల్ల తమ దేశానికి చెందిన కొంతమంది ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు' అని మంగళవారం తెలిపింది. ఈ మేరకు ఈ కామర్స్ నేషనల్ ఎల్ఎల్‌సీ d/b/a టోల్ ఫ్రీ డీల్ డాట్ కామ్, ఎస్ఐపీ రిటైల్ d/b/a సిప్రెటైల్ డాట్ కామ్‌లతో పాటు వాటి ఓనర్లు లేదా ఆపరేటర్లు నిఖోలస్ పాలుంబో, నటాషా పాలుంబోలపై ఓ కేసు నమోదయింది. గ్లోబల్ వాయిస్‌కామ్ ఇంక్, గ్లోబల్ టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇంక్, కేఏటీ టెలికం ఇంక్‌తో పాటు వీటి ఓనర్లు లేదా ప్రమోటర్లు జో కహెన్ పైన మరో కేసు నమోదయింది.

రోబోటిక్ కాల్స్ వెంటనే నిలిపివేయాలి..
పై సంస్థల నుంచి రోబోటిక్ కాల్స్‌ను వెంటనే నిలుపుదల చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. గ్లోబల్ వాయిస్‌కామ్ నుంచి వాయిస్ కాల్స్ నిలిపివేయాలని టెంపరరీగా ఫెడరల్ కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ ప్రకారం అమెరికన్లు చాలా కాలంగా పేక్ కాల్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోసపూరిత కాల్స్‌ను తీవ్రంగా పరిగణించాలని చెబుతున్నారు.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications