వాషింగ్టన్: ఇప్పటికే భారత్ 59 చైనీస్ యాప్స్‌ను నిషేధిస్తూ షాకిచ్చింది. అగ్ర రాజ్యం అమెరికా కూడా చైనా కంపెనీలను దెబ్బకొట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం ట్రేడ్ వార్ ముగుస్తుందనే సమయంలో కరోనా మహమ్మారి రూపంలో ఈ దేశాల మధ్య వాగ్యుద్ధం మరింత పెరిగింది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ టెక్నాలజీ దిగ్గజాలు హువావే, జెడ్‌టీఈ నుండి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ప్రకటించింది.

హువావే, జెడ్‌టీఈపై నిషేధం
హువావే, జెడ్‌టీఈ నుండి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(US-FCC) మంగళవారం ప్రకటించింది. ఈ సంస్థల నుండి చేసే కొనుగోళ్లపై నిషేధం విధించింది. దీంతో అమెరికాలో టెలికం సర్వీసెస్‌ను విస్తరించే దిశగా చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనివర్సల్ సరవీస్ ఫండ్ నిధులతో ఈ సంస్థల నుండి పరికరాలు కొనుగోలు చేయకూడదు. ఇతర సేవలను పొందడానికి కూడా ఆ నిధులను వినియోగించవద్దు.

ముప్పుపై బలమైన ఆధారాలు
అమెరికా జాతీయ భద్రతకు వాటి నుండి ప్రమాదం ఉందని బలమైన ఆధారాలు ఉన్నాయని FCC చైర్మన్ అజిత్ పాయ్ చెప్పారు. 5జీ భవిష్యత్తుకు సైతం సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ఆ దేశ సైనిక వ్యవస్థతో ఈ రెండు కంపెనీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ సంస్థల నిబంధనలు చైనా నిఘా వ్యవస్థలకు సహకరించే చట్టాలకు లోబడి ఉన్నాయన్నారు.

టెక్నాలజీ వ్యవస్థని కొల్లగొట్టే అవకాశమివ్వం
కాంగ్రెస్ పరిశీలనలు, నిఘా వర్గాల అభిప్రాయాలు, ఇతర దేశాలలోని సర్వీస్ ప్రొవైడర్ల సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నామని, ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అమెరికా సమాచార, సాంకేతిక వ్యవస్థలను కొల్లగొట్టేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

హువావే మనుగడకే ప్రమాదం
కాగా, ఈ ఏడాది FCCకి పరికరాల కొనుగోలు కోసం 8.3 బిలియన్ డాలర్లు కేటాయించారు. అమెరికా మొబైల్ నెట్ వర్క్ వ్యవస్థను రక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు US-FCC తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 5జీ టెక్నాలజీకి సంబంధించి మౌలిక వసతుల ఏర్పాటులో హువావే కీలక పాత్ర పోషిస్తోంది. అయితే అమెరికా నిర్ణయంతో ప్రభావం పడవచ్చు. సంస్థ మనుగడకే ఇది ప్రమాదమని చెబుతున్నారు.

హువావే, జెడ్‌టీఈ...
అమెరికా తాజా నిర్ణయంపై హువావే, జెడ్‌టీఈ స్పందించాల్సి ఉంది. అయితే గతంలోనే FCC చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించే టెలికమ్యూనికేషన్ పరికరాల కంపెనీల్లో హువావేను గత ఏడాది చేర్చింది అమెరికా. అప్పుడు ట్రేడ్ బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు ట్రంప్. చైనా పరికరాలపై FCC మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications