For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిక్ టాక్ విక్రయానికి డిసెంబర్ 4 వరకు గడువు పొడిగింపు

|

ప్రస్తుత అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విభాగం చైనీస్ యాప్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ విక్రయానికి మరో వారం రోజుల పాటు గడువును పెంచింది. ఈ మేరకు కోర్టుకు సమాచారం ఇచ్చింది. దీంతో డిసెంబర్ 4వ తేదీలోగా టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్ డ్యాన్స్‌కు సమయం దొరికింది. టిక్ టాక్‌ను అమెరికా సంస్థలకు విక్రయించాలని ట్రంప్ పాలనా వర్గం ఆగస్ట్‌లో ఆదేశించింది. ఈ గడువును పలుమార్లు పొడిగించింది. తాజాగా 27వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పెంచింది.

కరోనా టైంలోను మోడీ వెనుకాడలేదు, మరింత జోరు.. ఆగదు: నిర్మల సీతారామన్కరోనా టైంలోను మోడీ వెనుకాడలేదు, మరింత జోరు.. ఆగదు: నిర్మల సీతారామన్

తొలుత ఆగస్ట్ ప్రారంభంలో 45 రోజుల గడువు ఇచ్చారు. ఇప్పుడు దానిని 90 రోజులకు నవంబర్ 12వ తేదీకి పొడిగించారు. అనంతరం మరో 15 రోజులు పొడిగించి, నవంబర్ 27వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ఇప్పుడు మరో వారం పొడిగింపు లభించింది.

US extends Tiktok sale deadline to December 4

ట్రంప్ పరిపాలనా వర్గం ప్రకారం.. నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్ అమ్మకం ప్రక్రియను బైట్ డ్యాన్స్ పూర్తి చేయాలి. అమెరికన్ యూజర్ల డేటాను పూర్తిగా తొలగించాలి. అమెరికా జాతీయ భద్రతను బైట్ డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తోందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ట్రంప్ తన గత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిక్ టాక్ యాప్ వ్యాల్యుయేషన్ 50 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోంది. అమెరికాలో టిక్‌టాక్‌కు 100 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

English summary

టిక్ టాక్ విక్రయానికి డిసెంబర్ 4 వరకు గడువు పొడిగింపు | US extends Tiktok sale deadline to December 4

The US Treasury on Wednesday said it had extended by seven days the November 27 deadline given to the Chinese owner of TikTok to sell the popular social media platform's American business.
Story first published: Thursday, November 26, 2020, 15:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X