For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డొనాల్డ్ ట్రంప్Xజోబిడెన్: కరోనా కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థే కీలకం

|

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా కనిపిస్తున్నాయి. తొలుత డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ముందంజలో ఉండగా, ఆ తర్వాత రిపబ్లికన్‌కు చెందిన డొనాల్డ్ ట్రంప్ క్రమంగా పుంజుకున్నారు. ఓ సమయంలో ఇరువురి మధ్య దాదాపు వంద ఎలక్టోరల్ ఓట్ల తేడా కనిపించగా, ఇప్పుడు పెద్దగా తేడా లేదు. వివిధ సర్వేల్లో బిడెన్ భారీ ఆధిక్యంతో గెలుస్తారని వెల్లడించారు. కానీ ఎవరు గెలిచినా అంత సులభంగా కనిపించడం లేదు. చాలా కీలక రాష్ట్రాల్లో ట్రంప్ పట్టు సాధించారు. లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం జోబిడెన్ 224, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఎవరు గెలవాలన్నా 270 ఎలక్టోరల్ ఓట్లు రావాలి.

ఆర్థిక వ్యవస్థ అద్భుతం.. అమెరికా ఎకానమీని డొనాల్డ్ ట్రంప్ నిలబెట్టారుఆర్థిక వ్యవస్థ అద్భుతం.. అమెరికా ఎకానమీని డొనాల్డ్ ట్రంప్ నిలబెట్టారు

ఆర్థిక వ్యవస్థ క్లిష్టమైన అంశం

ఆర్థిక వ్యవస్థ క్లిష్టమైన అంశం

ట్రంప్ దుందుడుకు వ్యవహారశైలి వంటి వివిధ కారణాలతో ఆయనకు ఘోర పరాజయం తప్పదని డెమోక్రటిక్ నేతలతో పాటు చాలా సర్వేలు తెలిపాయి. కానీ ట్రంప్ గట్టి పోటీ ఇవ్వడం.. ఎవరు గెలుస్తారో లేదో తెలియని పరిస్థితుల్లోకి ట్రంప్ నెట్టడాన్ని చూస్తే ఆయనకు అమెరికన్లలో ఉన్న పట్టు కనిపిస్తోందని అంటున్నారు. ట్రంప్‌కు అంతగా మద్దతు రావడానికి ప్రధానంగా ఎకానమీ అని చాలామంది భావిస్తున్నారు. అమెరికా ఓటర్లలలో దాదాపు మూడొంతుల మంది అధ్యక్షుడి ఎన్నికల్లో ఆర్థిక వ్యవస్థ పైనే దృష్టి సారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ క్లిష్టమైన అంశంగా సీఎన్ఎన్ నేషనల్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఓటర్లు అభిప్రాయపడ్డారు.

కరోనా సమస్య.. ఆరుగురిలో ఒకరు

కరోనా సమస్య.. ఆరుగురిలో ఒకరు

ప్రతి ముగ్గురిలో ఒకరు ఆర్థిక వ్యవస్థను ప్రధాన అంశంగా చూడగా, 5గురిలో ఒకరు జాత్యాంహకారాన్ని అంశంగా తెలిపారు. 2020లో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని అతిపెద్ద సమస్యగా పేర్కొన్న వారు ప్రతి 6గురిలో ఒకరు కావడం గమనార్హం. దాదాపు ప్రతి పది మందిలో ఒకరు హెల్త్ కేర్ పాలసీ, క్రైమ్, హింసాత్మక సంఘటనలు ప్రధాన అంశాలుగా తెలిపాయి. మంగళవారం 100 మిలియన్లకు పైగా అమెరికన్లు బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ రాష్ట్రాలు కీలకం

ఈ రాష్ట్రాలు కీలకం

న్యూయార్క్, న్యూజెర్సీ, మసాచుసెట్స్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్, వర్జీనియా వంటి రాష్ట్రాలు చాలా కీలకం. ఇక్కడ పది నుండి 55 వరకు ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మరో ముప్పై రాష్ట్రాల్లో 10కి తక్కువగా ఉన్నాయి. పెన్సిల్వేనియా జోబిడెన్ సొంత రాష్ట్రం. ఇక్కడ గెలుపు కోసం మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామాను కూడా రంగంలోకి దించారు. గత ఎన్నికల్లో ఇక్కడ ట్రంప్ అతి స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఇక్కడ ట్రంప్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary

డొనాల్డ్ ట్రంప్Xజోబిడెన్: కరోనా కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థే కీలకం | US Election 2020: Economy Critical Issue for One third of Voters

According to the CNN National Exit Polls, the Economy is the most critical issue in US citizens' vote for the next US President.
Story first published: Wednesday, November 4, 2020, 12:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X