షియోమీ, నూక్‌లపై కఠిన నిర్ణయం: గద్దె దిగే ముందు చైనాకు ట్రంప్ వరుస షాకులు
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దిగిపోయే సమయంలోను చైనాకు వరుసగా షాకులు ఇస్తున్నారు. తాజాగా చైనాకు చెందిన మరిన్ని కంపెనీల్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇది జోబిడెన్‌కు చిక్కులు తీసుకు తెచ్చేదే. మరో ఐదు రోజుల్లో బిడెన్‌కు అధికారం అప్పగించనున్న ట్రంప్ గతకొద్ది రోజులుగా డ్రాగన్ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. తన ఓటమికి చైనా ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆయన గద్దె దిగడానికి ముందు చైనా కంపెనీలపై మరింత విరుచుకు పడుతున్నారు.
జోబిడెన్‌కు చిక్కులు, అలీపే సహా 8 చైనీస్ పేమెంట్ యాప్స్‌కు ట్రంప్ షాక్

ఒబామా దారిలో ట్రంప్
ట్రంప్ చైనా కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దాదాగిరీ చేసినందుకు ఆంక్షలు విధించినట్లు చెబుతున్నారు. 9 చైనా కంపెనీల్లో అమెరికా పెట్టుబడులను నిషేధించారు. పలువురు కీలక వ్యక్తులపై ఆంక్షలు విధించారు. ట్రంప్ నిర్ణయంతో చైనా కంపెనీలకు కీలకమైన టెక్నాలజీ అందడం ఇక మరింత కష్టంగా మారే అవకాశముంది. 2016 ఎన్నికల్లో జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ ఒబామా కూడా ఇలాంటి ఆంక్షలు విధించారు. ట్రంప్ ఇప్పుడు అదే వైఖరి కొనసాగించారు.

అందుకే తొలగింపు
తాజాగా, డ్రాగన్ దేశ ప్రభుత్వరంగ సంస్థ చైనా నేషనల్ ఆఫ్ షోర్ ఆయిల్ కార్పోరేషన్(Cnooc) దక్షిణ చైనా సముద్ర జలాల్లో చమురు అన్వేషించే పొరుగుదేశాలని వేధిస్తోందని అమెరికా పేర్కొంది. వియత్నాం వంటి దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. సముద్ర జలాల్లో పెత్తనం చలాయించడం, కృత్రిమ ద్వీపాల నిర్మాణానికి సహకారం వంటివి చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. దీంతో Cnoocను అమెరికా డిపార్టుమెంట్ ఆప్ కామర్స్ ఎంన్టీటీ జాబితాలో చేర్చింది. అమెరికా నుండి ఎలాంటి పరికరాలు, టెక్నాలజీ అందాలన్నా లైసెన్స్ లైసెన్స్ సంపాదించాలి. ఇది కష్టంగా మారుతుంది.

డౌజోన్స్ నుండి ఔట్
Cnoocను ఎస్ అండ్ పీ డౌజోన్స్ సూచీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ నుండి తొలగిస్తారు. ఆ తర్వాత చైనాకు చెందిన షియోమీని కూడా చైనా సైన్యంతో సంబంధాలు ఉన్న జాబితాలో చేర్చింది అమెరికా. ఈ నిర్ణయంతో అమెరికా ఇన్వెస్టర్లు షియోమీ సెక్యూరిటీలను కొనుగోలు చేయలేరు. ఇన్వెస్ట్ చేయలేరు. అలాగే, స్కైరిజోన్‌ను మిలిటరీ ఎండ్ యూజర్ లిస్టులో చేర్చిన అమెరికా మరిన్ని చైనా సంస్థలపై ఆంక్షలు విధించింది.