For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ చైనా కంపెనీల కలలకు ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్, హువావేకు జతగా బ్లాక్‌లిస్ట్‌లో

|

అమెరికా వాణిజ్య విభాగం సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్పోరేషన్ తాజాగా చైనా కంపెనీలకు భారీ షాకిచ్చింది. డ్రోన్ తయారీ కంపెనీ SZ DJI టెక్నాలజీ కంపెనీతో పాటు 60కి పైగా ఇతర చైనా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నట్లు ప్రకటించింది. అమెరికా జాతీయ భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కామర్స్ సెక్రటరీ విల్బర్ రోజ్ దీనిని ధృవీకరించారు.

ఆర్థిక ఇబ్బంది, ఆ అవకాశం ఉపయోగించుకుంటున్నారు! క్రెడిట్ కార్డ్‌పై లోన్ సామర్థ్యం తగ్గింపుఆర్థిక ఇబ్బంది, ఆ అవకాశం ఉపయోగించుకుంటున్నారు! క్రెడిట్ కార్డ్‌పై లోన్ సామర్థ్యం తగ్గింపు

టాప్ చిప్ మేకరు కూడా..

టాప్ చిప్ మేకరు కూడా..

యూఎస్ కామర్స్ డిపార్టుమెంట్ చర్యలు తీసుకున్న చైనా కంపెనీల్లో చైనా టాప్ చిప్ మేకర్ SMIC ఉంది. దీంతో ఈ కంపెనీ షేర్లు 5 శాతానికి పైగా క్షీణించాయి. అమెరికా ప్రభుత్వ ప్రకటన ప్రకారం... మానవ హక్కుల ఉల్లంఘన, దక్షిణ చైనా సముద్రంలో సైనికీకరణకు, చట్టవిరుద్ధమైన మెరిటైమ్ వాదనలకు మద్దతు ఇచ్చే సంస్థలు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చే సంస్థలు లేదా వ్యక్తులపై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ట్రంప్ అదే నిర్ణయం...

ట్రంప్ అదే నిర్ణయం...

ఇప్పటికే హువావే వంటి కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం గతంలోనే షాకిచ్చింది. ఇప్పుడు తాజా కొత్త కంపెనీలు ఈ వరుసలో చేరాయి. హువావే, SMIC వంటి కంపెనీలు రెండు అగ్ర ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో విలవిల్లాడుతున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ గెలిచారు. ఆయన వైట్ హౌస్‌లో అడుగు పెట్టడానికి ముందే ట్రంప్ చైనాకు, చైనా కంపెనీలకు వ్యతిరేకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు.

చైనా స్పందన

చైనా స్పందన

అమెరికా ఆంక్షలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందించారు. తమ దేశానికి చెందిన కంపెనీలపై ఆంక్షలు సరికాదని, ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. జాతీయ భద్రత అనే వాదనతో చైనాకు చెందిన కంపెనీలను అణిచివేయాలని చూడటం సరికాదన్నారు. క్వాల్‌కామ్ ఇంక్, బ్రోడ్‌కామ్ ఇంక్ వంటి వాటికి SMIC సరఫరాదారు. అమెరికన్ టెక్నాలజీపై ఆధారపడకుండా సొంతగా నిలదొక్కుకుంది. అయితే ఇప్పుడు SMICను బ్లాక్ లిస్ట్‌లో చేర్చడం ద్వారా ఆ కంపెనీకి షాకిచ్చింది. అమెరికా సహా వివిధ దేశాలకు విస్తరించి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్న SMICకు వాషింగ్టన్ చెక్ పెట్టినట్లయింది.

English summary

ఆ చైనా కంపెనీల కలలకు ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్, హువావేకు జతగా బ్లాక్‌లిస్ట్‌లో | US blacklists more than 60 Chinese firms, including SMIC

The US Commerce Department announced it’s blacklisting Semiconductor Manufacturing International Corp., drone maker SZ DJI Technology Co. and more than 60 other Chinese companies “to protect U.S. national security.”
Story first published: Saturday, December 19, 2020, 21:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X