కరోనా మహమ్మారి కారణంగా మే నెలలో 23.48 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జూన్‌లో 10.99 శాతానికి తగ్గింది. దాదాపు లాక్ డౌన్ పూర్వ పరిస్థితి సమీపానికి వస్తున్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) నివేదిక వెల్లడించింది. జూన్ నెలలో పట్టణ ప్రాంతంలో 12.02 శాతం నిరుద్యోగిత రేటు ఉండగా, గ్రామీణ ప్రాంతంలో 10.52 శాతంగా నమోదయింది. కరోనా కారణంగా ఏప్రిల్, మే నెలల్లో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయడంతో తగ్గింది.

12.2 కోట్ల ఉద్యోగాలు పోయాయి
నిరుద్యోగిత రేటు హర్యానాలో 33.6 శాతం, త్రిపురలో 21.3 శాతం, జార్ఖండ్‌లో 21 శాతంగా నమోదయింది. సీఎంఐఈ డేటా ప్రకారం జూన్ నెలలో ఉద్యోగుల సంఖ్య 37.3 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న వారి సంఖ్య 46.1 కోట్లుగా ఉంది. జూన్ నెలలో దేశంలో ఉపాధి రేటు 35.9గా నమోదయింది. మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రకటించడంతో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగింది. CMIE డేటా ప్రకారం ఏప్రిల్ నెలలో 12.2 కోట్ల ఉద్యోగాలు పోయాయి.

నిరుద్యోగిత రేటు
మార్చిలో నిరుద్యోగిత రేటు 8.75 శాతంగా ఉంది. జనవరిలో 7.22 శాతం, ఫిబ్రవరిలో 7.76 శాతంగా ఉంది. ప్రస్తుతం నిరుద్యోగిత రేటు లాక్ డౌన్ కంటే ముందు సమీపానికి చేరుకుందని CMIE మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో మహేష్ వ్యాస్ అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పలువురు వలస కార్మికులు వారాలు, నెలల పాటు ఇంటికి తిరిగి వెళ్లిన తీరు హృదయ విదారకం అన్నారు.

ఈ స్కీం కింద 53 శాతం పెరిగిన ఉపాధి
CMIE నివేదిక ప్రకారం మే 2020లో రూరల్ అన్‌ఎంప్లాయిమెంట్ స్కీం కింద పెద్ద ఎత్తున ఉపాధి కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఏకంగా 53 శాతం పెరిగి 565 మిమిలియన్లకు చేరుకుంది. 2019 మే నెలలో ఈ సంఖ్య 370 మిలియన్లుగా ఉంది. ఈ ఏడాది మే నెలలో 656 మిలియన్లకు పెరిగింది. మే నెలలో 33 మిలియన్ల హౌస్ హోల్డ్స్ ఈ స్కీం ద్వారా లబ్ధిపొందాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 55 శాతం పెరిగింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications