For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2020: మార్కెట్ ఆశిస్తోన్న 3 ముఖ్య అంశాలు

|

ఓవైపు మందగమనం కారణంగా జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది. మరోవైపు బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగం, డిమాండ్ పెంచడానికి కార్పోరేట్ పన్ను తగ్గింపు, రియాల్టీకి ఊతమిచ్చేందుకు ఉద్దీపనలు ప్రకటించింది మోడీ ప్రభుత్వం. మందగమనంలోను మార్కెట్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. మందగమనం సమయంలో నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. పన్నులు, డివిడెండ్, దీర్ఘకాలిక మూలధన ఆదాయం పన్ను అంశాల్లో ఊరట లభించవచ్చునని భావిస్తున్నారు.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు..

లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్

లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్

లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (LTCG) పద్నాలుగేళ్ల తర్వాత 2014లో తిరిగి ప్రవేశ పెట్టారు. రూ.1 లక్ష దాటిన షేర్లపై 10 శాతం వరకు పన్ను విధిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు అవకాశాలు ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీలపై LTCG పన్నును తొలగించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.

ప్రస్తుతం 10 శాతం పన్ను

ప్రస్తుతం 10 శాతం పన్ను

దీర్ఘకాలం ఉన్న నిర్వచనాన్ని ఏడాది నుంచి రెండేళ్ల వరకు పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం LTCGపై 10% పన్ను ఉంది. చాలా వరకు ఉంది. ప్రధాని మోడీ హామీ నేపథ్యంలో దీనిని తగ్గిస్తారనిFPI, ఇతర ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా పెట్టుకున్నారు. LTCG తదితర పన్నుల కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు కొందరు విదేశీ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటున్నారని కూడా చెబుతున్నారు. మార్పులు చేస్తే పెట్టుబడులు పెరగొచ్చు. మార్కెట్ పరిస్థితులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం వీటిని హేతుబద్దీకరించవచ్చునని అంటున్నారు.

డివిడెండ్ ట్యాక్స్

డివిడెండ్ ట్యాక్స్

ప్రభుత్వం డివిడెండ్‌ను పంపిణీ చేసే కంపెనీలపై ట్యాక్స్ విధిస్తోంది. దీనినే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటారు. కంపెనీకి వచ్చిన లాభాలకు అదనంగా కూడా ట్యాక్స్ ఉంటుంది. ఇండియన్ కంపెనీలు 20 శాతానికి పైగా చెల్లిస్తున్నాయి. డివిడెండ్లు పొందే వారిపై రూ.10 లక్షలు దాటితే అదనంగా మరో 10 శాతం ట్యాక్స్ ఉంది. ఈ నేపథ్యంలో డివిడెండ్ ట్యాక్స్ తొలగించాలనే డిమాండ్ ఉంది.

మళ్లీ వ్యవస్థలోకి..

మళ్లీ వ్యవస్థలోకి..

వ్యవస్థలోకి నగదు ప్రవాహం, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు వ్యక్తిగత ఆదాయపు పన్నును తగ్గించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వానికి ప్రత్యక్ష ఆదాయంలో కోత పడినా పరోక్షంగా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రజలు ఆ సొమ్మును కొనుగోళ్లు, పెట్టుబడులకు ఉపయోగిస్తే మళ్లీ వ్యవస్థలోకే వస్తుందని అంటున్నారు.

English summary

Budget 2020: మార్కెట్ ఆశిస్తోన్న 3 ముఖ్య అంశాలు | Three key tax reforms that markets expect

At a time when the GDP is at a six-year low and consumption has slowed down, expectations from the Budget are really high.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X