For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనిల్ అంబానీకి షాక్, 680 బిలియన్ డాలర్ల రుణంపై దావా

|

రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీకి చైనాకు చెందిన మూడు బ్యాంకులు షాకిచ్చాయి. తమకు రావాల్సిన 680 మిలియన్ల డాలర్లను చెల్లించాలని దావా వేశాయి. తీసుకున్న రుణాలు చెల్లించేలా ఆదేశించాలని చైనీస్ బ్యాంకుల లండన్ కోర్టులో దావా వేశాయి. కంపెనీ నుంచి ఈ బ్యాంకులకు ఇంకా 680 బిలియన్ డాలర్లు రావాల్సి ఉంది. ఈ రుణ చెల్లింపుల కోసం ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్, చైనా డెలప్‌మెంట్ బ్యాంక్, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనాలు కోర్టుకు వెళ్లాయి.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు 925.2 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఈ మూడు బ్యాంకులు 2012లో అంగీకరించాయి. పర్సనల్ గ్యారంటీ హామీతో ఈ రుణాలు ఇచ్చేందుకు అంగీకరించాయి. ఇచ్చిన రుణంలో కంపెనీ కొంత మొత్తం చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. 2017 ఫిబ్రవరి నెలలో ఈ రుణం డీఫాల్ట్‌గా మారింది. దీంతో బ్యాంకులు రుణ వసూలు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

జియో రూ.149 ప్లాన్‌లో మార్పు: టాపప్ లేకుండా 300 ని.లు ఫ్రీజియో రూ.149 ప్లాన్‌లో మార్పు: టాపప్ లేకుండా 300 ని.లు ఫ్రీ

Three Chinese banks sue Anil Ambani for USD 680 million unpaid loan

పర్సనల్ కంఫోర్ట్ లెట్టర్ ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ, అనిల్ అంబానీ వ్యక్తిగత ఆస్తులతో ముడివడి ఉన్న హామీని ఇవ్వలేదని ఆయన తరఫు లాయర్ చెబుతున్నారు. అనిల్ అంబానీ తరఫున వ్యక్తిగత హామీపై రిలయన్స్ కమర్షియల్ అండ్ ట్రెజరీ హెడ్ శుక్లా సంతకం చేశారని బ్యాంకులు కోర్టుకు చెప్పాయి. అయితే శుక్లాకు సంతకం చేసే అనుమతి గానీ అధికారం గానీ అనిల్ అంబానీ ఇవ్వలేదని, కాబట్టి ఆ హామీ నాన్ బైండింగ్ కిందకు వస్తుందని అనిల్ అంబానీ లాయర్ల వాదన.

English summary

అనిల్ అంబానీకి షాక్, 680 బిలియన్ డాలర్ల రుణంపై దావా | Three Chinese banks sue Anil Ambani for USD 680 million unpaid loan

Three Chinese banks are suing the brother of Asia’s richest man in a London court for failing to pay back $680 million in defaulted loans.
Story first published: Monday, November 11, 2019, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X