For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 19: కొత్త మార్గంలో పరుగు.. ఆదాయం కోసం అలా రూటుమార్చిన కంపెనీలు

|

కరోనా మహమ్మారి కారణంగా ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. మన దేశం సహా పలు దేశాలు వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అత్యవసర మెడిసిన్స్, నిత్యావసరాలు తప్పితే మిగతా వ్యాపారాలు అన్ని క్లోజ్ అయ్యాయి. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో పెద్ద కంపెనీల నుండి చిన్న స్థాయి వరకు ఉద్యోగులకు వేతనాల్లో కోత విధించడం, ఉద్యోగులను తొలగించడం వంటివి చేస్తున్నాయి. పెద్ద కంపెనీల వద్ద లిక్విడిటీ ఉంటుంది. కానీ కొన్ని చిన్న కంపెనీల పరిస్థితి ఏమిటి?

వర్క్ ఫ్రమ్ హోమ్ మరో 3 నెలలు, IT ఇండస్ట్రీకి ఊరట: ఏడాది ఇచ్చే అవకాశముందా?వర్క్ ఫ్రమ్ హోమ్ మరో 3 నెలలు, IT ఇండస్ట్రీకి ఊరట: ఏడాది ఇచ్చే అవకాశముందా?

డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేదు.. కంపెనీల దృష్టి

డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేదు.. కంపెనీల దృష్టి

ఇలాంటి పరిస్థితుల్లో చిన్న కంపెనీలు చాలా వరకు తమకు అనుభం లేని ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం నిత్యావసర వస్తువులతో పాటు కరోనా మహమ్మారి నుండి రక్షించుకునేందుకు మాస్క్‌లు, శానిటైజర్లకు భారీ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న కంపెనీలు ఉత్పత్తులు పెంచాయి. డిమాండ్ తగినట్లుగా ఉత్పత్తులు అందించలేకపోతున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉన్న కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఇలాంటి ఉత్పత్తుల దిశగా దృష్టి సారించాయి.

ఫుడ్ వ్యాపారం నుండి కిరాణా డెలివరీ వైపు

ఫుడ్ వ్యాపారం నుండి కిరాణా డెలివరీ వైపు

ఉదాహరణకు ఇప్పటి వరకు సెట్ టాప్ బాక్సులు, ఫుడ్ లేదా రెస్టారెంట్ వ్యాపారాలలో ఉన్న కొన్ని సంస్థలు ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కేందుకు శానిటైజర్లు, మాస్కుల తయారీని, అలాగే నిత్యావసర వస్తువుల సేవల్లోకి అడుగు పెట్టాయి. ఉదాహరణకు ఫుడ్ లేదా రెస్టారెంట్ వ్యాపారులు నిత్యావసర వస్తువులను లేదా కిరాణా సామాగ్రిని చేరవేస్తూ ఈ పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, బిజినెస్‌లో నష్టాన్ని పూడ్చుకునేందుకు ఫుడ్ వ్యాపారంలో ఉన్నవారు కిరాణా వస్తువలు సరఫరాను ఉపయోగించుకోవడంలో ఇబ్బందిలేదు.

ఆన్‌లైన్ వీడియో ద్వారా ట్రెయినింగ్

ఆన్‌లైన్ వీడియో ద్వారా ట్రెయినింగ్

సెట్ టాప్ బాక్స్ వంటి ఇతర రంగాల్లో ఉన్న చిన్న కంపెనీలు కొన్ని ఇప్పుడు మాస్కులు తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. కరోనా కారణంగా మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్ పెరగడమే కాదు.. ఇప్పుడు లాభాల్లో ఉన్న అతి కొన్ని వ్యాపారాల్లో ఇది ముందుంది. దీంతో ఈ రంగంలో ఏమాత్రం అనుభవం లేని సంస్థలు మాస్కులు వంటివి తయారు చేస్తున్నాయి. అవసరమైతే ఆన్‌లైన్ వీడియో శిక్షణ ద్వారా వీటి తయారీని నేర్చుకుంటున్నారు.

సర్జికల్ మాస్కులపై అనుభవం కలిగిన వారి నుండి నేరుగా వీడియో ద్వారా ఉద్యోగులకు శిక్షణ ఇప్పిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయట. ఉదహారణకు ఓ సెట్ టాప్ బాక్స్‌లు తయారు చేసే సంస్థ.. ఉద్యోగులకు ఇలా వీడియో శిక్షణ ద్వారా గంటకు ఇప్పుడు ఆరువేల వరకు సర్జికల్ మాస్కులు ఉత్పత్తి చేస్తోందట. డిమాండ్ ఉండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుందట కూడా. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు చిన్న కంపెనీల నుండి స్టార్టప్స్ వరకు ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఉత్పత్తుల వైపు దష్టి సారిస్తున్నాయట. అవి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్ (PPE), శానిటైజర్స్, గ్రాసరీస్ లేదా మాస్కులు.. ఇలా ఏదైనా కావొచ్చు.

రెండు విధాలుగా ప్రయోజనమా?

రెండు విధాలుగా ప్రయోజనమా?

ప్రస్తుతం అన్ని వ్యాపారాలు క్లోజ్ అయిన పరిస్థితుల్లో కంపెనీని నిలబెట్టుకోవడం, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం కోసం మాత్రమే కాకుండా మార్కెట్‌లోని డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితికి సహకరించినట్లుగా.. ఉభయతారకంగా ఉంటుందని భావిస్తున్నారట. మార్కెట్లో ప్రస్తుతం ఉత్పత్తుల కొరత కనిపిస్తోందని, దీనిని పరిష్కరించాల్సి ఉందని ఆయా రంగాల్లోని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని సంస్థలు డిమాండ్‌కు తగినట్లు వ్యాపారాన్ని పొడిగిస్తున్నారని, అయితే ఇది తమ కోర్ బిజినెస్‌కు సంబంధించినది కాకుంటే ఆపర్చునిస్టిక్ అవుతుందని చెబుతున్నారు. అసలు ఇలా తయారు చేసేందుకు వారు ఏ మేరకు సిద్ధమయ్యారనేది కూడాప్రశ్నే అంటున్నారు.

తర్వాత పరిస్థితి ఏమిటి?

తర్వాత పరిస్థితి ఏమిటి?

లాక్ డౌన్ తర్వాత లేదా కరోనా తర్వాత ఇలా సంబంధం లేని వ్యాపారాల్లోకి అడుగు పెట్టిన కంపెనీల పరిస్థితి ఏమిటి అంటే.. డిమాండ్ ఉన్న ఈ కొద్ది రోజుల్లోనే ఆదాయంపై దృష్టి సారించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉండి ఉత్పత్తి లేకపోవడంతో అన్నీ మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఓసారి పరిస్థితులు మారిపోయాక తిరిగి బ్రాండ్ ప్రధానంగా మారుతుందని అంటున్నారు.

English summary

Covid 19: కొత్త మార్గంలో పరుగు.. ఆదాయం కోసం అలా రూటుమార్చిన కంపెనీలు | Small companies change track to ramp up Covid 19 essentials

Small businesses are venturing out into unchartered territories to stay relevant amid coronavirus outbreak.
Story first published: Wednesday, April 29, 2020, 14:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X