For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధరలు.. అయినా బంగారం ప్రియులలో టెన్షన్.. త్వరలో 60వేలకు పసిడి!!

బంగారం ధరలు తగ్గినా బంగారం ప్రియులలో వదలని టెన్షన్ తగ్గటం లేదు. త్వరలో 60 వేలకు పసిడి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

|

గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నట్టే, నిపుణులు అంచనా వేస్తున్నట్టే బంగారం ధరలు జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చెయ్యలేనంతగా బంగారం ధరలు పెరిగాయి. సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్న బంగారం ధరలు ముందు ముందు మరింత దూకుడును కొనసాగిస్తాయి అన్న చర్చ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో బంగారం ధర 60 వేల రూపాయలకు చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే తాజాగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ లు పెరగటం తో బంగారం ధరలు కాస్త తగ్గాయి.

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఇలా

తాజాగా దేశంలో వివిధ ప్రధాన నగరాలలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు 53,100 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. ఈ ధర నిన్న 53,610 గా కొనసాగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 57,930 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధర నిన్న 58,480 గా కొనసాగింది.

ఢిల్లీ, ముంబై లలో నేడు బంగారం ధరలు ఇలా

ఢిల్లీ, ముంబై లలో నేడు బంగారం ధరలు ఇలా

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 53,250గా కొనసాగుతుంది. నిన్న 53,760 ట్రేడ్ అయ్యింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో నేడు ప్రస్తుతం 58,080 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. నిన్న 58,620గా కొనసాగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,100గా ట్రేడ్ అవుతోంది. నిన్న 53,610 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ముంబైలో నేడు 57,930 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. నిన్న 58,480గా కొనసాగింది.

చెన్నైలో 60 వేలకు చేరిన బంగారం ధరలు

చెన్నైలో 60 వేలకు చేరిన బంగారం ధరలు

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60 వేల రూపాయల మార్కును దాటింది. చెన్నైలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,400 గా ట్రేడ్ అవుతుండగా, నిన్న 55,060 రూపాయలుగా ట్రేడ్ అయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 60 వేల 60 రూపాయలుగా ట్రేడ్ కాగా నేడు 59,340 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. భారతదేశంలో బంగారం ధర 60 వేలను దాటుతుందని నిపుణుల అంచనాలను నిజం చేస్తూ చెన్నైలో నిన్న బంగారం ధర జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది.

బంగారం ధరలు నేడు తగ్గినా.. 60 వేల మార్కును చేరుతుందని అంచనా

బంగారం ధరలు నేడు తగ్గినా.. 60 వేల మార్కును చేరుతుందని అంచనా

మరికొద్ది రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చెన్నైలో మాత్రమే కాదు సేలం, వెల్లూరు, తిరునవేలి, తిరుపూర్, తిరుచ్చి, ఈరోడ్, కోయంబత్తూరు, మధురైలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న 60 వేల మార్కును దాటింది. నిన్నటితో పోలిస్తే హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు మేర, 24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయల మేర తగ్గినప్పటికీ, బంగారం ధరల పెరుగుదల బంగారం కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా మారింది.

బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు: యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల ఎఫెక్ట్; తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ ధరలివే!!బెంబేలెత్తిస్తున్న బంగారం ధరలు: యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల ఎఫెక్ట్; తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ ధరలివే!!

English summary

తగ్గిన బంగారం ధరలు.. అయినా బంగారం ప్రియులలో టెన్షన్.. త్వరలో 60వేలకు పసిడి!! | Reduced gold prices.. But tension among gold lovers.. Soon it will reach 60 thousand!!

Even if the price of gold has come down, the tension among gold lovers has not subsided. Experts predict that soon it will reach 60 thousand. Gold has already crossed the 60 thousand mark yesterday in many major cities along with Chennai.
Story first published: Friday, February 3, 2023, 10:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X