For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Yes bank crisis: సారీ సేవలు బంద్.. ఫోన్‌పే యూజర్లకు చుక్కలు

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యస్ బ్యాంకుపై నెల రోజుల పాటు మారటోరియం విధించింది. దీంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యస్ బ్యాంకుపై మారటోరియం దెబ్బ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పేపై పడింది. యస్ బ్యాంకు కస్టమర్లు నెలకు రూ.50,000 మాత్రమే అకౌంట్ నుండి విత్ డ్రా చేసుకోగలరు. ఈ ప్రభావం ఫోన్‌పేపై పడింది.

యస్ బ్యాంక్ క్రైసిస్: మరిన్ని కథనాలు..

తాత్కాలికంగా సేవలు లేవు..

తాత్కాలికంగా సేవలు లేవు..

యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించినప్పటి నుండి ఫోన్ పే యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి నుండే సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడింది. UPI ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయాయి. ఫోన్‌పే ఓపెన్ చేస్తే తాత్కాలికంగా సర్వీసులు అందుబాటులో లేవని చూపిస్తోంది.

యస్ బ్యాంకు ఆధారం...

యస్ బ్యాంకు ఆధారం...

డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పేపై ఎక్కువ ప్రభావం పడటానికి కారణం ఉంది. దీని నగదు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా యస్ బ్యాంకుపై ఆధారపడి ఉంటాయి. గురువారం సాయంత్రం నుండి బ్యాంకు సొంత నెట్ వర్క్ పని చేయలేదు. దీంతో ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌పై ఆధారపడిన ఫిన్‌టెక్ ఆపరేటర్ల సేవలు కూడా డౌన్ అయ్యాయి.

సారీ... పునరుద్ధరిస్తాం

సారీ... పునరుద్ధరిస్తాం

సుదీర్ఘ వైఫల్యానికి చింతిస్తున్నామని, మా భాగస్వామ్య (యస్ బ్యాంకు)పై ఆర్బీఐ తాత్కాలిక మారటోరియం విధించిందని, దీంతో ఇబ్బంది తలెత్తిందని, సాధ్యమైనంత త్వరలో సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని ఫోన్‌పే యాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ నిగమ్ ట్వీట్ చేశారు. కొద్ది గంటల్లో పునరుద్దరిస్తామని తెలిపారు.

ఫోన్‌పేతో పాటు...

ఫోన్‌పేతో పాటు...

దేశంలోని పెద్ద డిజిటల్ పేమెంట్ యాప్‌లలో ఫోన్‌పే ఒకటి. ఇది తమ ట్రాన్సాక్షన్స్ కోసం యస్ బ్యాంకుపై ఆధారపడింది. ఫోన్‌పేతో పాటు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (API) బ్యాంకింగ్ ఉపయోగించే ఫిన్‌టెక్ సంస్థలపై కూడా ప్రభావం పడింది.

English summary

Yes bank crisis: సారీ సేవలు బంద్.. ఫోన్‌పే యూజర్లకు చుక్కలు | RBI's moratorium, Yes Bank's digital partners Phonepe hit

After Yes Bank was placed under moratorium, digital payments were impacted as PhonePe, which depends on the cash strapped lender for its transactions, could not operate.
Story first published: Friday, March 6, 2020, 13:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X