For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్వే ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర డబుల్: హైదరాబాద్, కాచిగూడలలో రూ.10 పెంపు

|

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు పెంచనున్నారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణీకులతో పాటు ఎక్కువ మంది రైల్వే స్టేషన్స్‌కు వస్తారని, దీంతో స్టేషన్లలో రద్దీ ఉంటుందన్నారు.

దానిని తగ్గించేందుకు ప్లాట్ ఫారం టిక్కెట్ ధరను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.10 ఉంది. దీనిని పండుగ సందర్భంగా రూ.20కి పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన ధరలు 9వ తేదీ (గురువారం) నుంచి 20వ తేదీ వరకు అమలులో ఉంటాయి. కొత్త ఛార్జీలు సికింద్రాబాద్, హైదరాబాదు స్టేషన్లలో అమలులో ఉంటాయి.

మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?

 Platform ticket hiked by Rs.10 in Hyderabad during Sankranti

ప్లాట్ ఫారం ఛార్జీలు పెంచడం ద్వారా నాన్ ట్రావెలర్స్ రష్‌ను తగ్గించి, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేయాలని భావిస్తున్నారు. కాగా, సంక్రాంతి, దసరా వంటి పండుగ సందర్భాలలో బస్సు ఛార్జీలను కూడా పెంచడం తెలిసిందే. ఇలాంటి పండుగ సందర్భాలలో బస్సు ఛార్జీలు పెంచడంపై విమర్శలు కూడా ఉన్నాయి.

English summary

రైల్వే ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర డబుల్: హైదరాబాద్, కాచిగూడలలో రూ.10 పెంపు | Platform ticket hiked by Rs.10 in Hyderabad during Sankranti

The South Central Railway has enhanced the platform ticket by Rs 10 during Sankranti making the ticket price to Rs 20. The new prices will be charged at Secunderabad and Kacheguda railway stations.
Story first published: Friday, January 10, 2020, 9:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X