For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

87% పడిపోయిన పాసింజర్ వెహికిల్ సేల్స్, ప్రమాదంలో లక్షల ఉద్యోగాలు!!

|

మే నెలలో పాసింజర్ వెహికిల్ సేల్స్ భారీగా పడిపోయాయి. కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో పాసింజర్ వెహికిల్ సేల్స్ అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే 86.97 శాతం పడిపోయి 30,749 యూనిట్లకు తగ్గిందని ఆటోమొబైల్ డీలర్స్ బాడీ FADA (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్) గురువారం నాడు వెల్లడించింది. FADA 1,435 రీజినల్ ట్రాన్సుపోర్ట్ కార్యాలయాల (RTO)లలోని 1,225 ఆర్టీవోల నుండి సేసరించిన డేటా ఆధారంగా 2019 మే నెలలో 2,35,933 వాహనాలు సేల్ అయ్యాయి.

ఆటోమొబైల్స్‌కు సంబంధించి మరిన్ని వార్తలు

ఏ సేల్స్ ఎంత పడిపోయాయంటే

ఏ సేల్స్ ఎంత పడిపోయాయంటే

టూవీలర్ సేల్స్ 88.8 శాతం పడిపోయాయి. 2019 మే నెలలో 14,19,842 టూవీలర్స్ సేల్ కాగా ఈ ఏడాది మే నెలలో 1,59,039 యూనిట్లు మాత్రమే విక్రయించారు. కమర్షియల్ వెహికిల్ సేల్స్ గత ఏడాది 80,392 యూనిట్లు అమ్ముడు పోగా ఈసారి 96.63 శాతం తగ్గి 2,711 యూనిట్లకు పడిపోయాయి. త్రీ-వీలర్ సేల్స్ గత ఏడాది మే నెలలో 51,430 అమ్ముడుపోయాయి. ఈ ఏడాది 96.34 శాతం తగ్గి 1,881 యూనిట్లకు పడిపోయాయి.

ఈ సేల్స్ డిమాండ్‌ను సూచించవు

ఈ సేల్స్ డిమాండ్‌ను సూచించవు

మొత్తం సేల్స్ 2019 మే నెలలో 18,21,650 కాగా, ఈ ఏడాది మే నెలలో 88.87 శాతం పడిపోయి 2,02,697 యూనిట్లుగా ఉన్నాయి. మే నెల చివరి నాటికి 26,500 ఔట్ లెట్స్‌లలో 80 శాతం, 80 శాతం వర్క్ షాప్స్ కార్యకలాపాలు నిర్వహించాయి. లాక్ డౌన్ ఉన్నందున మే నెలలోని సేల్స్ డిమాండ్ పరిస్థితిని సూచించవని FADA ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలె అన్నారు.

అదే జరిగితే ప్రమాదంలో లక్షల ఉద్యోగాలు

అదే జరిగితే ప్రమాదంలో లక్షల ఉద్యోగాలు

అయితే జూన్ నెలలో చాలా వరకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ మొదటి పది రోజుల్లో డిమాండ్ తక్కువగానే ఉందని తెలిపారు. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ జాగ్రత్తల నేపథ్యంలో విక్రయాలు తగ్గాయని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బలహీనమైన డిమాండ్ ఉందన్నారు. కఠిన వ్యాపార పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వాహనాల అమ్మకాల సేల్స్ పైన మార్జిన్ పెంచాలని డీలర్స్ సంఘాలు కోరుతున్నాయని గుర్తు చేశారు. ఒకవేళ వాహనాలకు డిమాండ్ మరింత తగ్గితే లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్త ంచేశారు. వందలాది డీలర్ల మనుగడ కూడా ప్రమాదకరమేనని చెప్పారు.

English summary

87% పడిపోయిన పాసింజర్ వెహికిల్ సేల్స్, ప్రమాదంలో లక్షల ఉద్యోగాలు!! | Passenger vehicle sales decline 87 percent in May as lockdown hampers offtake

Automobile dealers body FADA on Thursday said passenger vehicle (PV) retail sales in May declined 86.97 per cent to 30,749 units as compared to same month last year, hit by coronavirus led lockdown.
Story first published: Thursday, June 11, 2020, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X