NRIలకు సంబంధించి ఆదాయపు పన్ను విషయమై నెలకొన్న సందిగ్ధతను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తొలగించారు. ఎన్నారైలపై పన్ను విధిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే గల్ఫ్ వంటి విదేశాల్లోని సంపాదనపై ఈ పన్ను ఉంటుందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆదివారం ఆమె స్పష్టత ఇచ్చారు. భారత్‌లోని ఎన్నారైల సంపదన పైనే పన్ను విధించనున్నట్లు తెలిపారు.

భారత్‌లోని సంపాదన పైనే పన్ను
ఎన్నారైలు కేవలం భారత్‌లో ఆర్జించే సంపాదనకు మాత్రమే పన్ను చెల్లించాలని సీతారామన్ తెలిపారు. ఇతర దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టవలసిన అవసరం లేదన్నారు. బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన ఈ కొత్త పన్ను విధానంపై అధికారులు, ఎన్నారైలు అయోమయానికి గురికావొద్దని చెప్పారు. ఎన్నారైలు ఇతర దేశాల్లో ఆదాయం పొందవచ్చునని చెప్పారు.

ఆ సంపాదనపై పన్ను విధించే అధికారం మాకు లేదు
ఎన్నారైలకు ఇక్కడి (భారత్) ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను తీసుకునేందుకు మాత్రమే తమకు హక్కు ఉందని నిర్మల తెలిపారు. విదేశాల్లో సంపాదించే ఆస్తులపై వచ్చే ఏ ఆదాయం పైనా పన్ను విధించే అధికారం తమకు లేదన్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటన కూడా జారీ చేసింది.

విదేశీ రాబడి జోలికి రాబోము
ఎన్నారై ఇతర దేశాల్లో ఆర్జించిన సంపాదనకు పన్ను విధించడం ఉండదు. కానీ భారత్‌లోని వ్యాపారాలు, ఆస్తులు, వృత్తి ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్ను విధిస్తామని చెప్పారు. అవసరమైతే ఈ నిబంధనను చట్టంలో చేరుస్తామన్నారు. ఎన్నారైలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎగవేసే వారిపైనే తమ దృష్టి అన్నారు. వారి విదేశీ రాబడి జోలికి తాము వెళ్లమని స్పష్టం చేశారు.

ఎన్నారై హోదాను అడ్డుపెట్టుకొని..
ఎన్నారై హోదాను అడ్డుపెట్టుకొని భారత దేశంలోని ఆస్తులపై ఆదాయం సంపాదిస్తూ పన్ను ఎగవేయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకే ఎన్నారై నిర్వచనంలో మార్పులు చేసినట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఏడాదిలో 183 రోజులు విదేశాల్లో ఉన్న భారతీయులను ఎన్నారైలుగా పరిగణించేవారు. ఇప్పుడు దీనిని 245 రోజులకు పొడిగించారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications