For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిక్‌టాక్‌ను ఎవరికీ విక్రయించలేదు: మైక్రోసాఫ్ట్‌తో పాటు ఒరాకిల్‌కు చైనా ఝలక్

|

చైనాకు చెందిన బైట్ డ్యాన్స్‌కు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికాలో తమ కార్యకలాపాల కోసం సాంకేతిక భాగస్వామిగా ఒరాకిల్‌ను ఎంచుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. టిక్‌టాక్‌ను దక్కించుకోవడానికి మైక్రోసాఫ్ట్ మొదటి నుండి ప్రయత్నాలు చేసింది. బైట్ డ్యాన్స్ చివరకు తమ భాగస్వామిగా ఒరాకిల్ వైపు మొగ్గుచూపిందని వార్తలు వచ్చినప్పటికీ అది కూడా వాస్తవం కాదని తెలుస్తోంది. తాజాగా, మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన కొనుగోలు ప్రతిపాదనను మాత్రం తిరస్కరించింది బైట్ డ్యాన్స్.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే: రూ.1 చెల్లించి ముందే బుక్ చేసుకోండి, ఈ కార్డుపై 10% డిస్కౌంట్ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే: రూ.1 చెల్లించి ముందే బుక్ చేసుకోండి, ఈ కార్డుపై 10% డిస్కౌంట్

మైక్రోసాఫ్ట్ ఏం చెప్పిందంటే?

మైక్రోసాఫ్ట్ ఏం చెప్పిందంటే?

తమ కొనుగోలు ప్రతిపాదనను బైట్ డ్యాన్స్ తిరస్కరించిందని, కానీ అంగీకరించి ఉంటే బాగుండేదని మైక్రోసాఫ్ట్ అభిప్రాయపడింది. దేశ, పౌరుల భద్రత దృష్ట్యా తమ కొనుగోలు ప్రతిపాదనలు టిక్‌టాక్ వినియోగదారులకు శ్రేయదాయకంగా ఉండేదని పేర్కొంది. పౌరుల, దేశ, సైబర్ భద్రతలకు అనుగుణంగా నకిలీ సమాచారం అరికట్టేలా మార్పులు చేసేవాళ్లమని తెలిపింది.

ట్రంప్ ఆదేశాలు.. ట్విస్ట్ మీద ట్విస్ట్

ట్రంప్ ఆదేశాలు.. ట్విస్ట్ మీద ట్విస్ట్

భద్రతా కారణాలతో టిక్‌టాక్ సహా వందలాది చైనీస్ యాప్స్‌ను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే ఆలోచనతో ఉన్నారు. దీంతో టిక్‌టాక్‌కు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ డెడ్ లైన్ లోగా టిక్‌టాక్ మూసివేత లేదా అమెరికా కంపెనీకి విక్రయించాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఈలోగా ఒరాకిల్ వైపు బైట్ డ్యాన్స్ మొగ్గు చూపిందని వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వివిధ రకాల వార్తలు వచ్చాయి... ప్రచారమూ జరిగింది. టిక్‌టాక్ కొనుగోలుకో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ట్విట్టర్ మొగ్గు చూపాయి. మరోవైపు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విక్రయించడం కంటే మూసివేతకు మొగ్గుచూపినట్లుగా కూడా ప్రచారం సాగింది. కానీ తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఒరాకిల్... ఎవరికీ అమ్మలేదు

ఒరాకిల్... ఎవరికీ అమ్మలేదు

టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ ఆసక్తి చూపాయి. మైక్రోసాఫ్ట్‌ను నిరాకరించిన నేపథ్యంలో ఒరాకిలా వైపు చూస్తుందని అర్థమవుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు. టిక్‌టాక్ కొనుగోలుకు ఒరాకిల్ సరైనదని ట్రంప్ కూడా గతంలో వ్యాఖ్యానించారు. ఓ వైపు ట్రంప్ ఇచ్చిన గడువులోగా విక్రయించడంతో పాటు, అదే ట్రంప్ సూచించిన కంపెనీకి విక్రయించేందుకు బైట్ డ్యాన్స్ మొగ్గు చూపిందని చెప్పగా, తాజాగా చైనీస్ స్టేట్ మీడియా మరో ప్రకటన చేసింది. టిక్‌టాక్‌ను అటు మైక్రోసాఫ్ట్ లేదా ఒరాకిల్ కొనుగోలు చేయడం లేదని చైనీస్ మీడియా తెలిపింది. ఈ మేరకు చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీజీటీఎన్ తెలిపింది.

English summary

టిక్‌టాక్‌ను ఎవరికీ విక్రయించలేదు: మైక్రోసాఫ్ట్‌తో పాటు ఒరాకిల్‌కు చైనా ఝలక్ | Neither Microsoft nor Oracle gets to buy TikTok US

Shortly after news broke that Microsoft is out of the picture in bidding for TikTok’s U.S. operations, and rumors began circulating that Oracle is the winner, China’s state broadcaster CGTN reported that ByteDance will not sell TikTok’s U.S. operations to Microsoft or Oracle, citing sources.
Story first published: Monday, September 14, 2020, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X