డిసెంబర్ 31లోపు తప్పనిసరి: ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన

డిసెంబర్ 31, 2019 లోపు ఆధార్ కార్డును - పాన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ప్రకటన చేసింది. ఆధార్ - పాన్ లింకింగ్ కోసం ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన డిపార్టుమెంట్ ఇటీవల డిసెంబర్ 31ని డెడ్ లైన్‌గా నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం పబ్లిక్ మెసేజ్‌లో భాగంగా లింక్ చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది.

భవిష్యత్తు నిర్మాణం కోసం, ఆదాయపు పన్ను సేవల ప్రయోజనాలు పొందడానికి 2019 డిసెంబర్ 31వ తేదీలోపు ముఖ్యమైన పాన్ - ఆధార్‌ను లింక్ చేయాలని, ఈ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. కాగా మరో పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పలుమార్లు డెడ్ లైన్లు పొడిగించినందున ఇప్పటికీ లింక్ చేసుకోని వారు మిగిలిన రోజుల్లో పూర్తి చేసుకోవడం మంచిది.

Mandatory to link PAN, Aadhaar by Dec 31: Income Tax Department

అంతకుముందు సెప్టెంబర్ 30 తేదీని గడువుగా విధించింది. దానికి ముందు కూడా పలు గడువులు ముగిశాయి. ఇన్నిసార్లు పొడిగింపు ఇచ్చినందున ఈసారి ఆ అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి లింక్ చేసుకోవడం ఉత్తమం. కాగా, ఆధార్ - పాన్ లింకింగ్ కోసం 56768కి ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లేదా ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్‌కు వెళ్లి అనుసంధానం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+