వొడాఫోన్ వివాదంలో అప్పీలుకు డిసెంబర్ వరకు సమయం
వొడాఫోన్ వివాదంలో అప్పీల్ కోసం డిసెంబర్ చివరి వరకు సమయం ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే అన్నారు. రూ.20 కోట్లకు పైనా రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ గ్రూప్‌కు అనుకూలంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అప్పీలుకు వెళ్ళాలా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి భారీగా పెట్టుబడులు, అందుకే.. : 25 ఏళ్ల కనిష్టానికి బంగారం డిమాండ్
కోర్టు ఇచ్చిన తీర్పు అప్పీలుకు వెళ్లదగినది అయితే మూడు నెలల సమయం ఉంటుందని, అంటే డిసెంబర్ చివరి వరకు సమయం ఉందన్నారు. ఆ లోపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదాలపై వెలువడిన తీర్పులకు కట్టుబడి ఉంటామని జైట్లీ ఇచ్చిన హామీపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

వొడాఫోన్ కంపెనీ చెల్లించాల్సిన రూ.20వేల కోట్ల రెట్రోస్పెక్టేటివ్ పన్ను కేసులో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పును భారత్ సవాల్ చేయనుందని తీర్పు సమయంలోనే వార్తలు వచ్చాయి. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయ సలహా కూడా కోరినట్లుగా తెలుస్తోంది.
2007లో భారత్‌లో టెలికం సేవలు అందిస్తున్న హచిసన్ ఈక్విటీలో 67 శాతం వాటాను వొడాఫోన్ రూ.1,100 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. దీనికి టీడీఎస్ కింద రూ.11,000 కోట్లు చెల్లించాలని ఆదాయపన్ను శాఖ అప్పుడు నోటీసులు పంపించింది. వొడాఫోన్ ఈ మొత్తం చెల్లించకపోవడంతో జరిమానా, వడ్డీ రూ.20వేల కోట్లకు పెరిగింది. రూ.12వేల కోట్ల వడ్డీ, రూ.7,900 కోట్ల పెనాల్టీ ఉంది. 2012 జనవరిలో ఐటీ శాఖ డిమాండును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. దీంతో ఆ తర్వాత రెండు నెలలకు కేంద్ర ప్రభుత్వం పాత తేదీలతో వర్తించేలా చట్టాన్ని సవరించింది.
వడ్డీ, అపరాధ రుసుముతో కలిపి రూ.22,100కోట్ల పన్ను నోటీసు పంపించింది. వొడాఫోన్ గ్రూప్‌కు పన్ను చెల్లించాలని ఈ నోటీసులు పంపించింది. దీంతో 2014లో వొడాఫోన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇటీవల వొడాఫోన్‌కు ఊరట లభించింది. ఈ తీర్పు ప్రకారం కోర్టు ఖర్చుల్లో 60 శాతాన్ని భారత ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఆఱ్బిట్రేటర్ నియామకానికి అయిన 6వేల యూరోల వ్యయంలో సగం భరించాలి. రూ.75 కోట్లు చెల్లించవలసి రావొచ్చునని అంచనా.