For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2022కి గాను H1B రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

|

2021 అక్టోబర్ 1వ తేదీ నుండి 2022 సెప్టెంబర్ 30వ తేదీకి గాను H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10వ తేదీ నుండి ప్రారంభమైంది. ఈ వీసా నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తెలిపింది. లాటరీ ద్వారానే H1B వీసాలు అందిస్తామని, కంప్యూటర్ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి దరఖాస్తులు దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా

దరఖాస్తుదారు USCIS అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే H1B వీసా కోసం రిజిస్ట్రేషన్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు (మన కరెన్సీలో రూ.730 వరకు) చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించి ప్రాథమిక సమాచారం అందించాలి.
ఎంపికైన దరఖాస్తుదారు మాత్రమే H1B క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేసేందుకు అర్హులు అవుతారు.

 H1B Registration For 2022 Has Started

ప్రతి సంవత్సరం అమెరికా విదేశీయులకు 65 వేల H1B వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20 వేల HB వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. ప్రతి సంవత్సరం విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85వేల H1B వీసాలు జారీ చేస్తోంది. ఐతే, ప్రతి ఏడాది అమెరికా ఇచ్చే 85వేల కొత్త H1B వీసాలలో సుమారు 70 శాతం వీసాలు (దాదాపు 60వేలు) భారతీయులకు జారీ అవుతున్నాయని అంచనా.

English summary

2022కి గాను H1B రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం | H1B Registration For 2022 Has Started

“The registration period this year is shorter than last year, and it is only the second year in the history of the filing of H1B visas where the employers can pre-register on the immigration services website."
Story first published: Wednesday, March 10, 2021, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X