For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్‌ఫోన్, గార్మెంట్స్, పాదరక్షలపై 18 శాతం జీఎస్టీ! ధరలు పెరిగినా...

|

సెల్‌ఫోన్లు, ఎరువులు, దుస్తులు, ఫుట్‌వేర్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)ను 18 శాతానికి పెంచవచ్చు. ఈ నెల 14వ తేదీన జరగనున్న జీఎస్టీ కౌన్సెల్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఉత్పత్తులపై జీఎస్టీని పద్దెనిమిది శాతానికి పెంచితే ఉత్పత్తుల ధరలు పెరిగి, వాటి ఖరీదు కూడా పెరగవచ్చు.

భారీ నష్టం.. అంతలోనే లాభం..: స్టాక్ మార్కెట్ల ఊగిసలాట, ఇన్వెస్టర్లను ఆడుకుంటున్న కరోనాభారీ నష్టం.. అంతలోనే లాభం..: స్టాక్ మార్కెట్ల ఊగిసలాట, ఇన్వెస్టర్లను ఆడుకుంటున్న కరోనా

జీఎస్టీ రేట్లు

జీఎస్టీ రేట్లు

జీఎస్టీని 18 శాతం చేయడం వల్ల ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగినా పన్ను వ్యవస్థ లోపాలను సరిదిద్ది, తయారీదార్లకు వర్కింగ్ క్యాపిటల్ పరిస్థితి మెరుగయ్యేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఉత్పత్తులపై 5 శాతం, 12 శాతం జీఎస్టీ రేట్లు ఉన్నాయి. అలాగే, వాటి విడిభాగాలు, యంత్ర పరికరాలకు 18 శాతం, 28 శాతం జీఎస్టీ రేటు ఉంది.

ఇన్‌పుట్ క్రెడిట్‌కు ఇబ్బందులు

ఇన్‌పుట్ క్రెడిట్‌కు ఇబ్బందులు

ఇలా ఉండటం వల్ల తయారీదారులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)కు దరఖాస్తు చేసినప్పుడు ఇబ్బందులు ఉంటున్నాయి. ఉత్పత్తి కంటే విడిభాగాల జీఎస్టీ రేట్లు అధికంగా ఉన్న వాటికి సంబంధించిన ITC అభ్యర్థనలు ఏడాదికి రూ.20,000 కోట్ల మేర ఉంటున్నారు. వీటిని సరి చేయాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఫుట్‌వేర్, టెక్స్‌టైల్, దుస్తులు, పునర్వినియోగ ఇంధన పరికరాలు, ట్రాక్టర్స్ వంటి వాటిల్లో ఉంది.

క్లెయిమ్స్..

క్లెయిమ్స్..

ప్రస్తుతం సెల్‌ఫోన్‌పై 12 శాతం జీఎస్టీ ఉంది. విడిభాగాలపై 18 శాతం ఉంది. ఎరువులు 5 శాతంలో ఉన్నాయి. వీటి యంత్రాలు, సేవలపై 18 శాతం ఉంది. 2017 జూలై నుండి ITC కింద రూ.6,000 కోట్లు, నూలుదారం, వస్త్రాలపై వరుసగా రూ.1,600 కోట్లు, రూ.2,300 కోట్ల చొప్పున క్లెయిమ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఫుట్‌వేర్‌కు సంబంధించి రూ.1,000 లోపు ఉన్న వాటిపై జీఎస్టీని ప్రభుత్వం గత ఏడాది 5 శాతానికి తగ్గించింది.

English summary

సెల్‌ఫోన్, గార్మెంట్స్, పాదరక్షలపై 18 శాతం జీఎస్టీ! ధరలు పెరిగినా... | GST on cellphones, footwear, textiles to be rationalised

The GST Council is likely to consider a proposal to increase GST on mobile phones to 18% in its next meeting to be held on March 14 to correct the inverted duty structure being faced by the industry, said officials aware of the development.
Story first published: Friday, March 13, 2020, 14:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X