For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్‌న్యూస్: ట్యాక్స్ తగ్గింపులేదు!

|

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. దీంతో కంపెనీలకు ప్రయోజనం కలగడమే కాకుండా ఆ కంపెనీలు ఆ ప్రయోజనాలను వినియోగదారులకు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో స్వల్పంగానైనా ధరలు తగ్గడమో లేక పెరగకుండా ఉండటమో జరుగుతుంది. ఇటీవల మందగమనం నేపథ్యంలో కేంద్రం పలు ఉద్దీపన చర్యలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఈ తగ్గింపు నేపథ్యంలో మోడీ ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయపన్ను విషయంలోను ఊరట ప్రకటన చేస్తుందనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ ట్యాక్సులు తక్కువగా ఉన్నాయి. అలాగే, ట్యాక్సులు తగ్గించడం సరికాదని, ఇటీవల నోబెల్ గ్రహీత అభిజిత్ ముఖర్జీ కూడా చెప్పారు. అంతేకాదు, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ఆదాయ పన్ను సూచన చేసిన సమయంలోను పన్నులు పెంచితేనే ఈ ఫండ్స్ వస్తాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత పన్ను విషయంలో ఊరట ప్రకటన రాకపోవచ్చు.

అవును.. అధిక పన్ను ఉండాలి, ఆదాయపు పన్ను పెంచండి: మోడీకి నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీఅవును.. అధిక పన్ను ఉండాలి, ఆదాయపు పన్ను పెంచండి: మోడీకి నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ

భారత్‌లో కంటే ఎక్కువ పన్ను

భారత్‌లో కంటే ఎక్కువ పన్ను

రాబోయే బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను మినహాయింపులు, ట్యాక్స్ స్లాబ్ భారీ ఊరట ఉండకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఎన్నో దేశాల్లో ఆదాయపు పన్ను భారత్‌లో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. చైనా, అమెరికా, యూకే వంటి దేశాల్లో ఎక్కువగా ఉందని గుర్తు చేస్తున్నారు. పన్ను మినహాయింపు ఇవ్వడానికి ఆర్థికంగా కూడా అనుకూలంగా లేదని చెబుతున్నారట.

తక్కువ సంపాదిస్తే పన్ను భారం క్రమంగా తగ్గుతోంది..

తక్కువ సంపాదిస్తే పన్ను భారం క్రమంగా తగ్గుతోంది..

పన్ను స్లాబ్స్‌ను నాలుగు విభాగాలుగా చేసి, ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఊరట ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే ట్యాక్స్ తక్కువగా ఉందని, మరింత చేసే పరిస్థితులు లేవని అంటున్నారు. ప్రభుత్వం క్రమంగా సామాజిక భద్రతను పెంచుతోందని, అదే సమయంలో తక్కువ ఆదాయం సంపాదించే వారిపై పన్ను భారం తగ్గిస్తోందని చెబుతున్నారు. గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచి రెండింతలు చేసిన విషయం తెలిసిందే.

ఏ దేశాల్లో ఎంత ఆదాయపు పన్ను ఉందంటే?

ఏ దేశాల్లో ఎంత ఆదాయపు పన్ను ఉందంటే?

వివిద దేశాల్లో పర్సనల్ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ జనాభాలో ఎక్కువ మందికి పబ్లిక్ హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, పెన్షన్, నిరుద్యోగ భృతి వంటివి ఉంటాయనేది క్రిటిక్స్ వాదన. ఉదాహరణకు హెల్త్ కేర్ విషయంచూస్తే యూకేలో 15 శాతం, అమెరికాలో 11 శాతంగా ఉంటే ఇండియాలో మాత్రం 65 శాతంగా ఉందని చెబుతున్నారు.

English summary

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బ్యాడ్‌న్యూస్: ట్యాక్స్ తగ్గింపులేదు! | Government virtually rules out any cut in income tax rates

The government has virtually ruled out a reduction in personal income tax, including in the forthcoming budget, with well placed sources citing examples of higher taxes in several countries.
Story first published: Wednesday, October 30, 2019, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X