For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదేం బ్యాడ్ ఐడియా కాదు: దిగుమతి సుంకం పెంపు, లగ్జరీ కార్లు మరింత భారం!

|

విదేశీ కార్లపై దిగుమతి సుంకం పెంపుకు సంబంధించి సంకేతాలు ఇచ్చారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. స్వీయ రక్షణ చర్యల్లో భాగంగా దిగుమతి చేసుకునే కార్లు, వాహన విడిభాగాలపై ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం) పెంచేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. కంప్లీట్లీ, సెమీ నాక్డ్ డౌన్ అసెంబ్లీ (CKD, SKD) యూనిట్లను విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం ద్వారా భారత్‌ను కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా ఉపయోగించుకుంటున్న వాహన కంపెనీలపై దిగుమతి సుంకం పెంచడం సరైనదేనని అభిప్రాయపడ్డారు.

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేయలేదా, విత్‌డ్రాకు పరిమితులుఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేయలేదా, విత్‌డ్రాకు పరిమితులు

ఎగుమతులకు ప్రోత్సాహం, EUతో ఫ్రీ-ట్రేడ్

ఎగుమతులకు ప్రోత్సాహం, EUతో ఫ్రీ-ట్రేడ్

ఆటో ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీయూష్ గోయల్ మాట్లాడారు. భారత్‌లో తయారీని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అనుగుణంగా ఎగుమతులు పెంపును ప్రోత్సహించడంతో పాటు యూరోపియన్ యూనియన్‌తో(EU) ఫ్రీ-ట్రేడ్ అగ్రిమెంట్ అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో తయారీకి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దేశీయ వాహనాలు, విడిభాగాల ఉత్పత్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నామన్నారు.

లగ్జరీ కార్ల ధరలు పెరుగుదల..

లగ్జరీ కార్ల ధరలు పెరుగుదల..

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే CKD, SKDఅసెంబ్లింగ్ యూనిట్లపై దిగుమతి సుంకం పెంచితే మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యు, ఆడి, స్కోడా, వోక్స్‌వాగన్ వంటి విలాస, ప్రీమియం కార్ల ధరలు మరింతగా పెరుగుతాయి. హోండా, టొయోటా లగ్జరీ, ప్రీమియం కార్ల ధరలు కూడా పెరగవచ్చు. అయితే వీటి ధరలు పెరిగితే ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులపై ప్రభావం పడుతుందని, డిమాండ్ కూడా తగ్గుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అదేం బ్యాడ్ ఐడియా కాదు

అదేం బ్యాడ్ ఐడియా కాదు

దేశంలోనే సాధ్యమైన ఉత్పత్తి ఉండాలని కోరుకుంటున్నామని, అందుకు అనుగుణంగా దిగుమతి సుంకం పెంచడం దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం అంత చెడ్డ ఆలోచన ఏమీ కాదని పీయూష్ గోయల్ అన్నారు.

దిగుమతులు తగ్గించుకోవాలి

దిగుమతులు తగ్గించుకోవాలి

మహీంద్రా అండ్ మహీంద్రాఎండీ పవన్ గోయెంకా మాట్లాడుతూ ఆటో, ఆటోపార్ట్స్ మేకర్స్ రానున్న నాలుగైదేళ్లలో దిగుమతులు తగ్గించుకోవడానికి టార్గెట్ సెట్ చేసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఆటో కాంపోనెంట్స్ కూడా తగ్గించాలని, ముఖ్యంగా ఇవి చైనా, ఇతర ఆసియా దేశాల నుండి వస్తున్నాయని తెలిపారు. అలాగే స్టీల్ విడి భాగాలు కూడా తగ్గించాలన్నారు. ఈ రెండింటి దిగుమతుల వ్యాల్యూ దాదాపు 5 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్నారు. మొత్తం ఆటో విడిభాగాల దిగుమతుల వ్యాల్యూ 13.7 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. రానున్న నాలుగైదేళ్లలో వీటిని సగానికి తగ్గించుకోవాలన్నారు.

English summary

అదేం బ్యాడ్ ఐడియా కాదు: దిగుమతి సుంకం పెంపు, లగ్జరీ కార్లు మరింత భారం! | Government may hike duty on imported cars

In a move seen as a protectionist measure, the government on Friday said that import duty on cars and completely- and semi knocked down assemblies (CKD and SKD) could be raised as it also advised foreign makers to reduce the amount of royalty payments that they charge on their subsidiaries.
Story first published: Sunday, September 6, 2020, 10:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X