For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో గోల్డ్‌మన్ శాక్స్ రెండో కార్యాలయం, 500 ఉద్యోగ అవకాశాలు

|

అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. గురువారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో గోల్డ్‌మన్ శాక్స్ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. హైదరాబాద్‌లో కార్యాలయాన్ని నెలకొల్పే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గోల్డ్‌మన్ శాక్స్‌కు ఇప్పటికే బెంగళూరులో ఓ ఆఫీస్ ఉంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా భారత్‌లో తమ రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు కెటీఆర్‌కు తెలిపారు. సంస్థ అంతర్జాతీయ వ్యాపార అవకాశాలకు అవసరమైన మద్దతును ఈ రెండు సెంటర్ల నుండి అందిస్తుందని తెలిపారు. గోల్డ్‌మన్ శాక్స్ కార్యాలయ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఉంటుందని కేటీఆర్ వారికి తెలిపారు.

గుడ్‌న్యూస్, ఐటీ రిటర్న్స్ దాఖలు 2 నెలలు గడువు పెంపు, ఇలా చేయండి...గుడ్‌న్యూస్, ఐటీ రిటర్న్స్ దాఖలు 2 నెలలు గడువు పెంపు, ఇలా చేయండి...

500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు

500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు

వచ్చే ఏడాది(2021) ద్వితీయార్థం నాటికి హైదరాబాద్‌లో గోల్డ్‌మన్ శాక్స్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 500 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే అవకాశముంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటారు. బెంగళూరు కేంద్రంలో 6,000 ఉద్యోగులు పని చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాపార భవన సదుపాయం, సంస్థ ఉద్యోగులకు అందుబాటులో ఉండే గృహాలు, నాణ్యమైన మౌలిక వసతులు ఉన్నాయని, దీంతో హైదరాబాద్‌లో రెండో కార్యాలయాన్ని నెలకొల్పాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా పురోగమిస్తుండటం, ఆర్థిక రంగం వంటి వివిధ అంశాలపై కేటీఆర్.. గోల్డ్‌మన్ శాక్స్ ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఆర్థిక రంగ సంస్థల రాక

ఆర్థిక రంగ సంస్థల రాక

హైదరాబాద్‌ భారీ కంపెనీలను ఆకర్షిస్తూనే ఉందని, కరోనా మహమ్మారి సమయంలోను భాగ్యనగరం తన పట్టును కోల్పోలేదని, పోటీతత్వాన్ని ప్రదర్శించడం వల్లనే ఇది సాధ్యమైందని, గోల్డ్‌మన్ శాక్స్ రాకతో హైదరాబాద్‌కు ఇప్పటికే బలంగా ఉన్న ఆర్థిక, సాంకేతిక సానుకూల వాతావరణం మరింత విస్తృతమవుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లో సింగపూర్‌కు చెందిన డీబీఎస్, అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్, సింక్రోని ఫైనాన్షియల్ వంటి ఆర్థిక రంగ సంస్థలు కూడా వచ్చాయి.

ఇదీ గోల్డ్‌మన్ శాక్స్

ఇదీ గోల్డ్‌మన్ శాక్స్

ఆర్థిక సేవల రంగంలో పేరొందిన గోల్డ్‌మన్ శాక్స్ అమెరికాలో బహుళజాతి పెట్టుబడుల బ్యాంకును నిర్వహిస్తోంది. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీస్, అసెట్ మేనేజ్‌మెంట్, ప్రైమ్ బ్రోకరేజీ సేవలతో పాటు సంస్థాగత పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటి. అమెరికా ట్రెజరీ సెక్యూరిటీ మార్కెట్‌కు ప్రధాన డీలర్‌గా ఉంది. 1869లో ప్రారంభమైంది. ఫార్చ్యూన్ 500లో 62వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ సంస్థ ఆర్థిక ఆదాయం 3,654 కోట్ల డాలర్లకు పైగా ఉంది.

English summary

హైదరాబాద్‌లో గోల్డ్‌మన్ శాక్స్ రెండో కార్యాలయం, 500 ఉద్యోగ అవకాశాలు | Goldman Sachs to open office Hyderabad, plans shared services facility

Investment banking firm Goldman Sachs has identified Hyderabad as a new location for its global shared services footprint in India. "The new Hyderabad office will be the second location for Goldman Sachs Services in India, and will complement the Bengaluru office footprint in terms of both execution and support that it will provide to the firm's businesses globally," a release from the state government quoted the firm as saying on Thursday.
Story first published: Friday, October 2, 2020, 7:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X