For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్, ఢిల్లీల్లో ఎంత పెరిగిందంటే?

|

రెండు మూడు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం సానుకూలంగా కనిపిస్తోంది. ఇప్పటికే తొలి వాణిజ్య ఒప్పందం పూర్తయింది. డిసెంబర్ 15న విధించే టారిఫ్స్‌ను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. ఈ రెండు అగ్రదేశాల వాణిజ్య ఒప్పందంపై కూడా బంగారం ధరలు ఆధారపడి ఉన్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా ధరలు దాదాపు నిలకడగా ఉన్నాయి. లేదా స్వల్పంగా తగ్గాయి. మూడ్రోజులుగా నిలకడగా ఉన్నాయి. తాజాగా ఆదివారం మాత్రం స్వల్పంగా పెరిగాయి.

మోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమందిమోడీ అద్భుత స్కీమ్‌లు: రూ.330తో బెనిఫిట్స్, 5.91 కోట్లమంది

రూ.200 పెరిగిన బంగారం ధర

రూ.200 పెరిగిన బంగారం ధర

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం కూడా అంతేస్థాయిలోపెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.37,700 నుంచి రూ.37,900కు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ.36,700 నుంచి రూ.36,900కు చేరుకుంది.

హైదరాబాద్ మార్కెట్లో..

హైదరాబాద్ మార్కెట్లో..

హైదరాబాదు మార్కెట్లో ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 పెరిగింది. దీంతో రూ.39,500కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.310 పెరిగింది. రూ.36,220కి పెరిగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాదులో కిలో వెండి ధర రూ.46,700కు చేరుకుంటుంది.

ఢిల్లీ మార్కెట్లో..

ఢిల్లీ మార్కెట్లో..

ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగి రూ.38,200గా ఉండగా, 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.37,000కు చేరుకుంది. వెండి ధర స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి రూ.46,700గా ఉంది. అమెరికా - చైనా వాణిజ్య చర్చలు ఫలప్రదమవుతున్నాయి. అదే విధంగా డాలరుతో పోలిస్తే రూపాయి కాస్త బలపడుతోంది.

English summary

పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్, ఢిల్లీల్లో ఎంత పెరిగిందంటే? | Gold prices rise slightly after a dip on Thursday

Precious metals have recently revived after the dollar worth lifted in the commodity market. The prices of gold have increased slightly today after falling on Thursday before the GST Council meeting scheduled for December 18.
Story first published: Sunday, December 15, 2019, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X