For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొనసాగుతున్న బంగారం ధరల పతనం.. నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!

తాజాగా మరోమారు బంగారం ధరలలో తగ్గుదల నమోదు కావడం పసిడి ప్రియులకు శుభవార్త.

|

చుక్కలు చూపించిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచి మళ్లీ తగ్గుతున్న బంగారం ధరలు సామాన్య మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనుగోలు పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్ల గరిష్ట స్థాయికి పెరిగిన బంగారం ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపుతో బంగారం ధరలకు కాస్త కళ్లెం పడినట్టు అయింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా కొంతమేర దిగివచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ధరలు ఇంకా తగ్గుతాయా? మరికొంత కాలం వేచి చూడొచ్చా? అని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు.

అంతర్జాతీయంగా గతేడాది మార్చి కంటే ఈ ఏడాది మార్చిలో తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయంగా గతేడాది మార్చి కంటే ఈ ఏడాది మార్చిలో తగ్గిన బంగారం ధర

భారతదేశంలో ఏ శుభకార్యమైన కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడం ఎంతోకాలంగా ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇటీవల కాలంలో బంగారం కొనుగోలుకు ఆసక్తి ఉన్నప్పటికీ విపరీతంగా పెరిగిన ధరలతో భారతదేశ వాసులు బంగారం కొనాలంటే విముఖతను వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో పెరిగిన బంగారం ధర, ఇప్పుడు మళ్లీ భారీగా తగ్గింది. గతేడాతో పోలిస్తే ఎక్కువగానే తగ్గినట్టు కనిపిస్తుంది. గతేడాది మార్చిలో అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్ కు 2052 డాలర్లు పలికితే ఇప్పుడు 1815 డాలర్లు మాత్రమే ఉంది. ఈ లెక్క ప్రకారం బంగారం ధర భారీగా తగ్గినట్టే కనిపిస్తుంది.

60 వేలకు పైగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గటంతో మళ్ళీ ఆశలు

60 వేలకు పైగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గటంతో మళ్ళీ ఆశలు

ఇక ఈ సంవత్సరం ఒక దశలో దేశీయంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 60 వేల రూపాయల మార్కు దాటినప్పటికీ మళ్లీ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. ఇక బంగారం బాటలో పెరిగిన వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టింది. ఇక ప్రస్తుతం తగ్గుతున్న ధరలతో బంగారం ధరలు మళ్ళీ ఇంకా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్న చాలామంది కొనుగోలు విషయంలో వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.

హైదరాబాద్, ఢిల్లీ లో బంగారం ధరలిలా

హైదరాబాద్, ఢిల్లీ లో బంగారం ధరలిలా

ఇదిలా ఉంటే తాజాగా మరోమారు బంగారం ధరలలో తగ్గుదల నమోదయింది. ఇక బంగారం ధరలలో స్థానికంగా ఉండే పన్నులను బట్టి కూడా మార్పులు ఉంటాయి. నేడు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,400 రూపాయలకు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో 56,070గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,550 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,210గా కొనసాగుతుంది.

ముంబై, బెంగళూరు, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా

ముంబై, బెంగళూరు, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 400 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 56,070 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ విశాఖపట్నంలో బంగారం ధరల విషయానికొస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖపట్నం నగరాలలో 51,400గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విజయవాడ, విశాఖపట్నంలో 56,070 గా కొనసాగుతుంది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 450 రూపాయలుగా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 56వేల 110 రూపాయలుగా కొనసాగుతుంది.

English summary

కొనసాగుతున్న బంగారం ధరల పతనం.. నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!! | Gold prices fall continues.. these are the gold rates today in Telugu states

The ongoing fall in gold prices is raising hopes among gold buyers. These are the gold prices in Telugu states today.
Story first published: Friday, March 10, 2023, 11:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X