For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిందికే చూస్తున్న బంగారం ధరలు.. భారీగా తగ్గుదల: తాజాగా తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!

వరుసగా పది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. నేడు కూడా బంగారం ధరలలో తగ్గుదల కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

|

వరుసగా పది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుదలను నమోదు చేస్తూనే ఉన్నాయి. విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తూ ఉండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక పొజిషన్లో బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడిన వారు ఇప్పుడిప్పుడు మళ్ళీ ఆ భయం నుండి బయటకు వస్తున్నారు. అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పడిపోతున్న క్రమంలో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుదల ప్రధానంగా కనిపిస్తుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అంతర్జాతీయంగా నేడు బంగారం ధర ఇలా

అంతర్జాతీయంగా నేడు బంగారం ధర ఇలా

గత పది రోజులలో ఒకసారి పెరిగిన బంగారం వెండి ధరలు, మిగిలిన అన్ని రోజులలోనూ వరుసగా పడిపోతూనే వచ్చాయి. అంతర్జాతీయంగానూ, దేశీయంగాను ప్రస్తుతం బంగారం ధరలలో క్షీణత కొనసాగుతుంది. ఇప్పటికే ఓ మారు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన క్రమంలో బంగారం ధరలు తగ్గాయి. ఇప్పుడు మరో మారు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నట్టుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు 1818 డాలర్ల వద్ద కొనసాగుతుంది. స్పాట్ వెండి రేటు ఔన్స్ కు 20 .65 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.

హైదరాబాద్, ఢిల్లీలలో తగ్గిన బంగారం ధరలు ఇలా

హైదరాబాద్, ఢిల్లీలలో తగ్గిన బంగారం ధరలు ఇలా

ఇక దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం తులానికి ప్రస్తుతం 51,350 వద్ద కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే ధర 150 రూపాయల మేర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే 56,020గా కొనసాగుతుంది. 24 క్యారెట్ల బంగారం మీద 160 రూపాయల మేర ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే ప్రస్తుతం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 51,500 ధర పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ప్రస్తుతం 56 వేల 170 రూపాయలు ధరగా ఉంది.

ముంబై, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా

ముంబై, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఇలా

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 51,350 గా కొనసాగుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,020 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 51,350 గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విజయవాడలో 56,020గా కొనసాగుతుంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 51 వేల 350 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,020 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది.

బెంగళూరు, చెన్నై లలో నేడు బంగారం ధరలు

బెంగళూరు, చెన్నై లలో నేడు బంగారం ధరలు

ఇక బెంగళూరులో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,400 రూపాయలుగా ఉంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 56,070 గా కొనసాగుతుంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,010గా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 56, 740 గా ట్రేడ్ అవుతుంది. దేశంలోనే అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై లలో బంగారం ధరలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

English summary

క్రిందికే చూస్తున్న బంగారం ధరలు.. భారీగా తగ్గుదల: తాజాగా తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!! | Gold prices are looking downwards; these are the latest rates in telugu states!!

Gold and silver prices have been recording decline from ten consecutive days. Even today, gold prices will see a drop. Currently gold prices in Telugu states are as follows.
Story first published: Tuesday, February 28, 2023, 9:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X