For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. నేడు ధరలిలా!!

పసిడి ప్రియులు గత పది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలతో మంచి జోష్ లో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

|

పసిడి ప్రియులు గత పది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలతో మంచి జోష్ లో ఉన్నారు. బంగారాన్ని కొనుగోలు చేయాలని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడేలా చేశాయి. ఓ దశలో బంగారం ధర 60 నుండి 62 వేల వరకు చేరుతుందన్న అంచనాలు కూడా నిపుణుల నుండి వ్యక్తమయ్యాయి. ఇక అలాంటి పరిస్థితిలో తాజాగా వరుసగా బంగారం ధరలు తగ్గుతూ రావడం గోల్డ్ లవర్స్ కు శుభవార్త అని చెప్పాలి.

ఒక నెల కనిష్టానికి తగ్గిన బంగారం ధరలు

ఒక నెల కనిష్టానికి తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ప్రస్తుతం ఒక నెల కనిష్ట స్థాయికి తగ్గడం ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల యూఎస్ వడ్డీరేట్లు పెంపు చేసినప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, దేశీయంగా ధరలు పెరిగిన బంగారం, ఇప్పుడిప్పుడే క్రమంగా కిందికి దిగొస్తోంది. ఇప్పుడు మళ్లీ యూఎస్ ఫెడరేట్ల పెంపు జరుగుతుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుదల ఆసక్తికరంగా మారింది. మరో వైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

హైదరాబాద్లో నేడు బంగారం ధరల తగ్గుదల.. లేటెస్ట్ రేట్లు ఇవే

హైదరాబాద్లో నేడు బంగారం ధరల తగ్గుదల.. లేటెస్ట్ రేట్లు ఇవే

అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ బంగారం ఔన్స్ కు 1823.69 డాలర్ల వద్ద ఉంది. ఇక దేశీయంగాను బంగారం ధరలు పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరలు విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,800 వద్ద కొనసాగుతుంది .నిన్న ఈ ధర 52,000 వద్ద ఉంది. అంటే 200 రూపాయలు 22 క్యారెట్ల బంగారం మీద ధర తగ్గింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక నిన్నటి ధర 56,730 ఉండగా నేడు 220 రూపాయల మేర 24 క్యారెట్ల పై బంగారం ధర తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలిలా

దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలిలా

ఇలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 950 రూపాయలుగా కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,610 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 800 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా ట్రేడ్ అవుతుంది.

 విజయవాడ, విశాఖ, చెన్నై లలో ధరలిలా

విజయవాడ, విశాఖ, చెన్నై లలో ధరలిలా

ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,800 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా ట్రేడ్ అవుతుంది. విశాఖలోని ఇవే ధరలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దేశంలోనే ధరలు ఎక్కువగా ఉండే చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,220 వద్ద కొనసాగుతుంది.

దేశంలో బంగారం స్మగ్లింగ్ కూడా .. భారీగా పట్టుబడిన బంగారం

దేశంలో బంగారం స్మగ్లింగ్ కూడా .. భారీగా పట్టుబడిన బంగారం

ఓవైపు బంగారం ధరలు ఈ విధంగా కొనసాగుతూ ఉంటే, దేశంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారు కూడా విపరీతంగా పెరిగిపోయారు. విమానాల ద్వారా బంగారాన్ని ఇతర దేశాల నుండి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా 23 మంది సూడాన్ దేశస్తులు తమ షూస్ కింద ప్రత్యేకమైన అరలలో బంగారాన్ని తరలిస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కష్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 8 కోట్లు విలువ చేసే 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం దొరకడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

English summary

పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. నేడు ధరలిలా!! | Gold price today: golden news for gold lovers.. the prices of gold have dropped again.. Today's prices!!

Gold lovers are in josh with the falling gold prices for the past ten days. They are showing enthusiasm to buy gold.. Gold prices in major cities today are as follows.
Story first published: Thursday, February 23, 2023, 13:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X