For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోబల్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్ 2 రోజులు క్లోజ్

|

ముంబై: గత ఏడాది(2019-20)లో భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు, ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న మాత్రం స్వల్ప ఊరటనిచ్చాయి. 2020-21 కొత్త ఆర్థిక సంవత్సరంలోను మార్కెట్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ప్రీఓపెన్ ట్రేడింగ్ లాభాల్లో ప్రారంభమైంది. ప్రీ ఓపెన్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 172 పాయింట్లు (0.58 శాతం) లాభపడి 29,640 వద్ద, నిఫ్టీ 7.35 పాయింట్లు (0.09 శాతం) లాభపడి 8,605.10 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

మార్కెట్లు మాత్రం నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. గం.9.16 సమయానికి సెన్సెక్స్ 217.62 పాయింట్లు (0.74%) నష్టపోయి 29,250.87 వద్ద, నిఫ్టీ 69.60 పాయింట్లు (0.81%) 8,528.15 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 328 షేర్లు లాభాల్లో, 251 షేర్లు నష్టాల్లో, 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఓ సమయంలో నిఫ్టీ 8,400 పాయింట్లు దిగజారింది. సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయింది.

2019-20లో రూ.37.60 లక్షల కోట్ల సంపద ఆవిరి, కరోనా దెబ్బతో మార్చిలోనే అత్యధికం2019-20లో రూ.37.60 లక్షల కోట్ల సంపద ఆవిరి, కరోనా దెబ్బతో మార్చిలోనే అత్యధికం

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం

భారత మార్కెట్లపై ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం పడింది. అమెరికా, స్పెయిన్, యూకే తదితర దేశాల్లో కరోనా మృతుల సంఖ్య రోజుకు వందల్లో ఉంటోంది. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడి, ఆ సెంటిమెంట్ మన మార్కెట్లను దెబ్బతీస్తోంది.

మార్కెట్లపై వడ్డీ రేటు, లాక్‌డౌన్ వంటి నిర్ణయాలు కూడా..

మార్కెట్లపై వడ్డీ రేటు, లాక్‌డౌన్ వంటి నిర్ణయాలు కూడా..

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్మాల్ సేవింగ్స్ పథకాలపై వడ్డీ రేటును తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభాం కూడా మార్కెట్లపై పడి ఉంటుందని అంటున్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక ప్యాకేజీ సిద్ధం చేస్తున్నందున ఈ వారం మార్కెట్లకు కొంత ఊరట ఉండవచ్చునని భావిస్తున్నారు. బుధవారం ఆసియా మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్ ఈక్విటీలకు నష్టాలే ఉండవచ్చునని అంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ రికవరీ లాక్ డౌన్ ఎత్తివేత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

కరెన్సీ మార్కెట్లు క్లోజ్

కరెన్సీ మార్కెట్లు క్లోజ్

ఇండియన్ కరెన్సీ మార్కెట్లు రెండు రోజుల పాటు క్లోజ్ అవుతాయి. నేడు (ఏప్రిల్ 1) యాన్యువల్ బ్యాంకు క్లోజింగ్ అకౌంట్స్ కారణంగా, ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ నవమి సందర్భంగా మూసివేసి ఉంటాయి. నిన్న... మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో డాలర్ మారకంతో రూపాయి 75.62 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు రోజైన సోమవారం 75.61 వద్ద ముగిసింది.

English summary

గ్లోబల్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్ 2 రోజులు క్లోజ్ | Global Markets effect: D Street fall, Nifty below 8,400, Sensex down 700 points

All the sectoral indices are trading lower. BSE Midcap and smallcap indices are trading with little change.
Story first published: Wednesday, April 1, 2020, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X