ప్రపంచ దేశాలలో భారత దేశంలో ప్రజలకు బంగారం అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు బంగారు అభరణాలు కొనుగోలు చేయడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తారు. పండుగలు పబ్బాలు, వివాహాది శుభకార్యాలు ఏవైనా సరే బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే. దీంతో దేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో బంగారాన్ని ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా ప్రజలు భావిస్తున్నారు. తక్కువ ధర ఉన్నప్పుడు కొనుగోలు చేసి, ఎక్కువ ధర ఉన్నప్పుడు బంగారాన్ని అమ్ముకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితి బంగారం ప్రియులకు ఒకింత ఆందోళన కలిగించింది. అయితే తాజాగా మూడు రోజులుగా బంగారం ధరలు కాస్త క్షీణించడం పసిడి ప్రియులకు ఒకింత ఊరట నిస్తుంది.

మూడోరోజు కూడా ఊరటనిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్, ఢిల్లీలో తాజా ధరలివే
వరుసగా మూడో రోజు కూడా భారతదేశంలో బంగారం ధరలు స్థిరంగా కనిపిస్తున్నాయి. దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000 రూపాయలుగా కొనసాగుతుంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,730 గా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లోనూ నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,730 రూపాయలు గాను ఈ సమయానికి ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,150 రూపాయలు గా ట్రేడ్ అవుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,890 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది.

దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఇలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000 గా ట్రేడ్ అవుతుంటే, నేడు ఈ సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,730 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక చెన్నైలో బంగారం ధరను చూస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,710 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,050 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 56,780గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,000గా ప్రస్తుతం ఈ సమయానికి ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,730 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

తగ్గుముఖం పట్టిన వెండి ధరలు
ఇక ఇదే సమయంలో వెండి కూడా గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 300 రూపాయలు తగ్గి కిలో వెండి ధర 71,900 పలుకుతుంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 73,500 రూపాయలకు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర గరిష్టంగా 75,800కు చేరగా ప్రస్తుతం తగ్గి 73,500 వద్ద కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే బంగారం, వెండి ధరలు తగ్గుతున్న పరిస్థితులు వినియోగదారులకు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. మరి ఈ తగ్గుదల ఇదే విధంగా కొనసాగుతుందా.. లేక ట్రెండు మళ్ళీ మారుతుందా అన్నది మాత్రం అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలు నిర్ణయిస్తాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా



Click it and Unblock the Notifications