భారత్ ఎగుమతులు నవంబర్ నెలలో ఏడాది ప్రాతిపదికన 9 శాతానికి పైగా క్షీణించాయి. వరుసగా రెండో నెలలో తగ్గిపోయాయి. 2019 నవంబర్‌తో పోలిస్తే గత నెలలో 9.1 శాతం పడిపోయి 23.43 బిలియన్ డాలర్లుగా నమోదయింది. దిగుమతులు కూడా ఏడాది ప్రాతిపదికన 13.33 శాతం క్షీణించి 33.39 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 9.96 బిలియన్ డాలర్లుగా నమోదయింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు వరుసగా ఆరు నెలల పాటు క్షీణించిన ఎగుమతులు సెప్టెంబర్‌లో వృద్ధి బాట పట్టాయి. అయితే అక్టోబర్‌లో తిరిగి క్షీణించింది. ఇప్పుడు రెండో నెల క్షీణించింది.

8 నెలల్లో 17.84 శాతం తగ్గిన దిగుమతులు
2020-21లోని మొదటి 8 నెలల్లో అంటే ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య ఎగుమతులు 17.84 శాతం క్షీణించాయి. దిగుమతులు 33.56 శాతం క్షీణించడంతో వాణిజ్యలోటు తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో మన ఎగుమతులు 17.84 శాతం తగ్గాయని, రత్నాభరణాలు, పెట్రోలియం ఎగుమతులను మినహాయిస్తే ఈ క్షీణత ఇంకా తక్కువగా ఉంటుందని బుధవారం కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనుప్ వాద్వాన్ వాణిజ్య బోర్డు సమావేశంలో తెలిపారు.

ఎగుమతులు ఇలా..
గత ఎనిమిది నెలల కాలంలో ఎగుమతులు భారీగా పెరిగిన వాటిలో ఫార్మా రంగం ముందుంది. ఫార్మాలో ఎగుమతులు 15 శాతం పెరిగాయి. ఇక రైస్ 39 శాతం, ఐరన్ ఓర్ 62 శాతం పెరిగాయి.
ఇక, నవంబర్ నెలలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 61.05 శాతం తగ్గాయి. లెదర్ 29.80 శాతం, కాజూ 24.90 శాతం క్షీణించాయి. ప్లాస్టిక్ అండ్ లినోలియం ఉత్పత్తులు 23.34 శాతం తగ్గాయి.
నవంబర్ నెలలో ఎగుమతులు పెరిగిన వాటిలో సెరెల్స్ (164.67%), ఆయిల్ మీల్స్ (70.54%), ఐరన్ ఓర్, (68.15%), రైస్ (24.41%), సెరామిక్ ఉత్పత్తులు, గ్లాస్‌వేర్ (20.98%) ఉన్నాయి.

పుంజుకుంటున్న కార్యకలాపాలు
ఆర్థిక కార్యకపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. వచ్చే ఏడాది భారత కార్పొరేట్ రంగం పరిస్థితులు కూడా మెరుగుపడనున్నాయి. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. అన్ని రంగాల్లో డిమాండ్ పెరుగుతుండటం కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు వృద్ధి చెందనున్నాయి. అయితే ఆర్థిక పరిపుష్టి కలిగిన కంపెనీలు సులభంగా నిధులు సమీకరించగలిగినప్పటికీ, కరోనా వల్ల దెబ్బతిన్న ఇతర కంపెనీలకు మాత్రం సవాళ్లు ఎదురు కానున్నాయి.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications