కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా ఉత్పత్తులపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని భావిస్తున్నారు. చైనా కరోనా వైరస్ ప్రభావం భారత ఆటో మొబైల్ పరిశ్రమపై కూడా పడనుంది. చైనాలో పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేయడంతో ఉత్పత్తులు నిలిచిపోయాయి. అక్కడి నుంచి వచ్చే విడిభాగాల సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్‌లోని ఆటో ఉత్పత్తులపై ప్రభావం పడనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఆటో ఉత్పత్తులు 8.3 శాతం పడిపోవచ్చు
2020 క్యాలెండర్ ఏడాదిలో భారత్‌లో ఆటో ఉత్పత్తులు 8.3 శాతం మేర పడిపోవచ్చునని ఫిచ్ సొల్యూషన్స్ బుధవారం అంచనా వేసింది. చైనా కరోనా వైరస్ కారణంగా ఆటో పరిశ్రమకు సరఫరా కొరత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. భారత్‌కు కూడా ఈ వైరస్ తాకితే దేశీయ ఉత్పత్తి కూడా పడిపోనుందని అభిప్రాయపడింది.

ఉత్పత్తి నిలిపివేత
కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆటోమేకర్స్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తితే భారత్ కూడా ఇదే విధానం అవలంభిస్తుందని అభిప్రాయపడింది. ఇండియా హెల్త్ కేర్ వ్యవస్థ అంత మెరుగ్గా లేదని, అలాంటి పరిస్థితులు ఎదురైతే భారత ఆటో ఇండస్ట్రీపై భారీగా ప్రభావం పడుతుందని పేర్కొంది. చైనాతో పోలిస్తే భారత్‌లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని తెలిపింది.

తప్పనిసరిగా ఉత్పత్తి నిలిపివేత
భారత్‌కు అతిపెద్ద ఆటో విడిభాగాల సరఫరాదారు చైనా. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అక్కడి పరిశ్రమలు మూతబడటంతో.. భారత్‌కు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. ఇది ఆటో మేకర్స్ ఉత్పత్తిని తగ్గించేందుకు కారణం అవుతుందని ఫిచ్ పేర్కొంది. తప్పనిపరిస్థితుల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తుందన్నారు.

వరుసగా రెండేళ్లు తగ్గుదల
ఈ లెక్కన భారత్‌లో 2020లో వాహనాల ఉత్పత్తి 8.3 శాతం మేర తగ్గుతుందని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఇప్పటికే 2019లో ఇది 13.2 శాతం తగ్గింది. కొత్త వాహనాలకు బలహీనమైన డొమెస్టిక్ డిమాండ్ ఈ ఏడాదిలోను కొనసాగుతుందని అభిప్రాయపడింది.

30 శాతం వరకు చైనా ఉత్పత్తులు
చైనాలో ఉత్పత్తి అయ్యే ఆటో కంపోనెంట్స్‌లో 10 నుండి 30 శాతం వరకు భారత్‌కు వస్తాయి. భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ విషయంలో ఇది రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. చైనీస్ ఉత్పత్తుల కారణంగా ఇది ఏ మేరకు ప్రభావం కానుందో తెలిస్తుంది. ఇటీవలి బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలంగా విధానాలు ఉన్నాయని పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications