For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

50 రోజులుగా క్లోజ్, అంచనాలకు మించి ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం రూ.15 లక్షల కోట్ల తక్షణ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కోరింది. కరోనా భారత ఆర్థిక వ్యవస్థను కకావికళం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీడీపీలో 7.5 శాతానికి సమానమైన ప్యాకేజీని లేదా రూ.15 లక్షల కోట్లను ప్రకటించాలని కోరింది. ఈ వైరస్ ప్రభావం మరో 12 నుండి 18 నెలల వరకు కొనసాగే అవకాశముందని తెలిపింది. కాబట్టి పరిశ్రమలకు, పేదలకు తక్షణమే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని పేర్కొంది.

కరోనా ఎఫెక్ట్: షాకింగ్.. ఇకపై రోజుకు 12 గంటలు పనిచేయాల్సిందే!కరోనా ఎఫెక్ట్: షాకింగ్.. ఇకపై రోజుకు 12 గంటలు పనిచేయాల్సిందే!

ఇలా సర్దుబాటు చేసుకోవచ్చు

ఇలా సర్దుబాటు చేసుకోవచ్చు

కరోనా - లాక్ డౌన్ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు దాదాపు 2 సంవత్సరాలు పడుతుందని CII ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పేపర్లను ఆర్బీఐకి విక్రయించడం ద్వారా రూ.2 లక్షల కోట్లు, సెకండరీ మార్కెట్ నుంచి రూ.2 లక్షల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడం ద్వారా రూ.4లక్షల కోట్ల వరకు సర్దుబాటు చేసుకోవచ్చునని తెలిపింది.

అంచనాల కంటే మరింత ప్రభావం

అంచనాల కంటే మరింత ప్రభావం

50 రోజులుగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, ముందస్తు అంచనాల కంటే కూడా ఆర్థిక వ్యవస్థ పైన మరింత ప్రభావం పడే అవకాశముందని, దీనిని అధిగమించేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరమని అభిప్రాయపడింది. భారీ ప్యాకేజీ ద్వారానే ఉద్యోగాలు, జీవనోపాధిని కాపాడుకోవచ్చునని పేర్కొంది. ప్రభుత్వ ప్యాకేజీలో రూ.2 లక్షల కోట్లను జన్ ధన్ అకౌంట్స్‌కు నగదు బదిలీ రూపంలో అందించడం కూడా భాగమేనని తెలిపింది.

వివిధ అసోసియేషన్స్ కోరిన ఆర్థిక ప్యాకేజీ

వివిధ అసోసియేషన్స్ కోరిన ఆర్థిక ప్యాకేజీ

ఇతర ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీ అవసరమని వెల్లడించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంపర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియా (FICCI) రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీని కోరింది. PHD చాంపర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ రూ.16 లక్షల కోట్ల ప్యాకేజీని డిమాండ్ చేసింది. Assocham రూ.14 లక్షల ప్యాకేజీ అడిగింది.

English summary

50 రోజులుగా క్లోజ్, అంచనాలకు మించి ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం | CII seeks Rs.15 lakh crore as immediate stimulus package

The CII has urged the government to announce an immediate stimulus package of ₹15 lakh crore, which translates into 7.5% of GDP, with COVID-19 crippling the Indian economy.
Story first published: Sunday, May 10, 2020, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X