For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

80,000 ఉద్యోగాలు హుష్‌కాకి, జీతం కట్.. కారణమిదే! అక్కడ ఉద్యోగాల కోసం రోడ్డెక్కారు

|

ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీగా తగ్గిపోతున్న డిమాండ్, టెక్టోనిక్ షిఫ్ట్ కారణంగా ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ఆటో ఇండస్ట్రీ అత్యంత విషమ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆటోకు డిమాండ్ లేక ఇటీవల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏజీ, ఆడీ వంటి దిగ్గజ కంపెనీలు దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. మొత్తంగా ఆటో కంపెనీలకు, ఆటో వర్కర్లకు వరస్ట్ ఏడాదిగా నిలిచింది.

'భారీ తగ్గింపులతో... మోడీ అతిపెద్ద కలకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అడ్డంకి!''భారీ తగ్గింపులతో... మోడీ అతిపెద్ద కలకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అడ్డంకి!'

ప్రపంచవ్యాప్తంగా 80,000 ఉద్యోగుల తొలగింపు

ప్రపంచవ్యాప్తంగా 80,000 ఉద్యోగుల తొలగింపు

బ్లూమ్‌బర్గ్ న్యూస్ డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రానున్న ఏడాది కాలంలో కారు తయారీ కంపెనీలు 80,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయి. జర్మనీ, అమెరికా, యూకేలలోను ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. వాణిజ్య ఉద్రిక్తతలు, టారిఫ్ పెరుగుదల, పెట్టుబడులు తగ్గిపోవడం వంటివి పరిశ్రమలకు ఇబ్బందికరంగా మారాయి. గ్లోబల్ ఆటో పరిశ్రమ ఈ ఏడాది 88.8 మిలియన్ కార్లు, లైట్ ట్రక్కులు ఉత్పత్తి చేస్తోంది. IHS మార్కిట్ రీసెర్చర్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం తగ్గుదల.

చైనాలో భారీగా ఉద్యోగాల కోత

చైనాలో భారీగా ఉద్యోగాల కోత

ఆటో పరిశ్రమలో అత్యధిక ఉద్యోగులు ఉన్నది చైనాలో. ఇక్కడ కూడా అమ్మకాలు తగ్గిపోయి అక్కడ కూడా కోతలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్ ఎన్ఐఓ ఇంక్ బిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. న్యూయార్క్ లిస్టెడ్ షేర్లు క్షీణించాయి. సెప్టెంబర్ చివరి నాటికి దాని ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించింది. దాదాపు 2వేలమంది ఉద్యోగులను తీసేసింది.

అందుకే ఉద్యోగాల కోత

అందుకే ఉద్యోగాల కోత

గ్లోబల్ మార్కెట్లలో నిరంతర మందగమనం వల్ల వాహన తయారీదారీల మార్జిన్లు, ఆదాయాలు తగ్గిపోయాయని, అప్పటికే ఆటోనోమస్ డ్రైవింగ్ టెక్నాలజీ కోసం ఆర్ అండీ స్పెండింగ్స్ ఎక్కువ కావడానికి ఇది తోడై భారం ఎక్కువయిందని బ్లూమ్ బర్గ్ ఎంటెలిజెన్స్ అనలిస్ట్ గిలియన్ డేవిస్ అన్నారు. దీంతో చాలామంది వాహనదారులు మార్జిన్ పైన దృష్టి సారించారని, ఖర్చును ఆదా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగాలు పోతున్నాయని అభిప్రాయపడ్డారు.

పడిపోయిన లాభాలు

పడిపోయిన లాభాలు

జపనీస్ ఆటోమేకర్‌లకు లాభాలు దశాబ్దకాల కనిష్టానికి పడిపోయాయి. దీంతో ఇక్కడ ఈ ఏడాది 12,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ చోట్ల తొలగింపులకు వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో 46,000 మంది 40 రోజుల లాంగ్ స్ట్రైక్ నిర్వహించారు. దాదాపు అర్ధ శతాబ్దంలో ఇంతలా నిరసనలు వ్యక్తం కావడం గమనార్హం.

ఉద్యోగాల కోతపై రోడ్డెక్కారు

ఉద్యోగాల కోతపై రోడ్డెక్కారు

Daimler AG‌కు గ్లోబల్ హెడ్ క్వార్టర్‌గా ఉన్న జర్మన్‌లోని స్టగ్గ్రాట్ నగరంలో నవంబర్ 22 వ తేదీన 15,000 మంది వీధుల్లోకి వచ్చి ఉద్యోగాల తొలగింపు, ఫ్యాక్టరీల మూసివేతకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. భారత్‌లో మరీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు గత ఆరేళ్లలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలే కారణంగా భావిస్తున్నారు. ఎర్రటి కండువాలు ధరించి, నిరసనకారులు ఈలలు వేస్తూ జర్మనీకి చెందిన పవర్‌ఫుల్లేబర్ యూనియన్ ఐజీ మేటాల్‌కు చాలామంది అండగా నిలబడ్డారు.

అలా ఉద్యోగాలను తొలగించనివ్వం

అలా ఉద్యోగాలను తొలగించనివ్వం

కొంతమంది మేనేజర్లు తమ ఇంటి వద్ద పనులు చేయనందుకు గాను ఉద్యోగాలను తొలగిస్తున్నారని, ఇలా చేసేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని ఐజీ మెటాల్ రీజినల్ హెడ్ రోమన్ అన్నారు. ఉద్యోగాల తొలగింపు, పరిశ్రమల మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జర్మనీలో 1,50,000 ఉద్యోగాల కోత?

జర్మనీలో 1,50,000 ఉద్యోగాల కోత?

ఉద్యోగుల ఆందోళనలకు పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. పేరెంట్ సంస్థ వోక్స్ వాగన్ 2025 నాటికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ పరివర్తనకు సిద్ధమవుతున్నందున 9,500 ఉద్యోగాల తొలగింపు ఉంటుందని జర్మనీలో ఆడి ప్రకటించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 10,000 ఉద్యోగాల తొలగింపును Daimler AG ప్రకటించింది. కేవలం జర్మనీలోనే 1,50,000కు పైగా ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు.

ఫోర్డ్ వేతన కట్

ఫోర్డ్ వేతన కట్

యూఎస్ కారు మేకర్ ఫోర్డ్ కంపెనీ వేతనాల పరిమితిని 10 శాతం తగ్గించింది. ఆరు ప్లాంట్లు మూసేసింది. రష్యాలో మూడు, యూకే, యూఎస్, ఫ్రాన్స్‌లలో ఒక్కో ప్లాంటును మూసేసింది. 17,000 నుంచి మంది ఉద్యోగులను ఫోర్డ్ తొలగించవచ్చు. ఇందులో యూరోప్‌లోనే 12,000 మందిని తొలగించనుంది.

English summary

80,000 ఉద్యోగాలు హుష్‌కాకి, జీతం కట్.. కారణమిదే! అక్కడ ఉద్యోగాల కోసం రోడ్డెక్కారు | Carmakers shedding 80,000 jobs as electric era upends industry

It’s turning out to be one of the worst years ever for auto workers across the globe amid shrinking demand and a tectonic shift in vehicle technology, with Daimler AG and Audi announcing almost 20,000 job cuts in just the past week.
Story first published: Wednesday, December 4, 2019, 12:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X