For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త, కరోనా టైంలో వేతనాలు పెరిగాయి, రూ.10,000 అలవెన్స్

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రధానంగా విమాన, ఆతిథ్య రంగాలపై భారీ ప్రభావం పడనుంది. ఇప్పటికే ఉద్యోగాలు పోవడం లేదా వేతన తగ్గింపులు వివిధ రంగాల్లోని ఉద్యోగాలు ఎదుర్కొంటున్నారు. వేతనాలు ఇవ్వడమే ఇబ్బందికరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు అధిక వేతనాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది శాలరీ హైక్ ఉండదని చాలామంది భావించారు. కానీ కొన్ని కంపెనీలు వేతనాలు పెంచాయి.

Good News: ఉద్యోగాల తొలగింతనే కాదు.. కరోనా తర్వాత ఈ రంగాల్లో కొత్త అవకాశాలుGood News: ఉద్యోగాల తొలగింతనే కాదు.. కరోనా తర్వాత ఈ రంగాల్లో కొత్త అవకాశాలు

ఉద్యోగులకు వేతనం పెంచిన క్యాప్‌జెమిని

ఉద్యోగులకు వేతనం పెంచిన క్యాప్‌జెమిని

ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని వంటి సంస్థల్లో దాదాపు 70 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వీరికి సింగిల్ డిజిట్ వేతనం పెరిగింది. ఈ సంస్థలోని 84.000 ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ వేతన పెంపు అమలవుతుంది. మిగతా వారికి అప్రైజల్స్ జూలై నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

క్యాప్‌జెమినిలో కొత్త ఉద్యోగాలు

క్యాప్‌జెమినిలో కొత్త ఉద్యోగాలు

క్యాప్‌జెమిని నాలుగువేల జాప్ ఆఫర్లు కూడా ఇచ్చింది. ఇందులో 2,000 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. కేవలం క్యాప్‌జెమినియే కాదు వివిధ సేవా సంస్థలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగాలు ఉండటం కష్టంగా ఉందనే సమయంలో కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు ఊహించని విధంగా వేతన పెంపు, కొత్త ఆఫర్లు ఇవ్వడం గమనార్హం.

కొంతమంది ఉద్యోగులకు రూ.10,000 అలవెన్స్

కొంతమంది ఉద్యోగులకు రూ.10,000 అలవెన్స్

ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఐటీ మల్టీ నేషనల్ కంపెనీ తమ ఉద్యోగులకు కొందరికి రూ.10,000 అలవెన్స్ కూడా ఇస్తోందట. రీలోకేషన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, అకామిడేషన్ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ మొత్తం అందిస్తోంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.

ఉద్యోగులందరినీ నిలుపుకునే దిశగా..

ఉద్యోగులందరినీ నిలుపుకునే దిశగా..

తమ ఉద్యోగులందరినీ నిలుపుకుంటామని క్యాప్ జెమిని చెబుతోంది. బిల్లబుల్ ప్రాజెక్టుపై లేకుండా బెంచ్‌కు పరిమితమైన వారిని కూడా నిలుపుకుంటామని చెబుతోంది. సాధారణంగా ఉద్యోగులను 60 రోజుల పాటు బెంచ్‌కు పరిమితం చేస్తారు. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 8 శాతం మంది బెంచ్‌కు పరిమితమవుతారు.

భారత్‌పే, కాగ్నిజెంట్ కూడా

భారత్‌పే, కాగ్నిజెంట్ కూడా

డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ భారత్‌పే కూడా తమ ఉద్యోగులకు 20 శాతం హైక్ ఇచ్చింది. కాగ్నిజెంట్ ఏప్రిల్ నెలకు గాను బేసిక్ శాలరీలో 25 శాతం అదనపు మొత్తాన్ని ఇస్తోంది. మరోవైపు అసోసియేట్ స్థాయి ఉధ్యోగుల వరకు వేతనం పెంచింది. ఇండియాలో ఈ అమెరికన్ ఐటీ దిగ్గజానికి 2,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీనిని అమలు చేయడం ద్వారా దాదాపు మూడొంతుల మంది ఉద్యోగులకు వేతనం పెరిగినట్లు.

English summary

ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త, కరోనా టైంలో వేతనాలు పెరిగాయి, రూ.10,000 అలవెన్స్ | Capgemini, Cognizant, Bharatpe giving salary hike amid coronavirus

IT major Capgemini is giving 70% of its employees a higher single-digit pay hike this year. That helps 84,000 employees who will enjoy increased pay, starting April 1.
Story first published: Wednesday, April 15, 2020, 14:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X