భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో చాలామంది భారతీయులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని చెబుతున్నారు. అలాగే ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సినిమా తారలు, క్రికెట్ స్టార్స్‌కు లేఖలు రాస్తూ.. చైనీస్ ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు బడా పారిశ్రామికవేత్తలకు కూడా లేఖలు రాశారు.

ముఖేష్ అంబానీ సహా 50 మందికి లేఖలు
CAIT 50 మంది ప్రముఖ వ్యాపారవేత్తలకు లేఖలు రాసింది. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రేజ్, అజిమ్ ప్రేమ్‌జీ, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, నారాయణమూర్తి, గౌతమ్ అదానీ, అజయ్ పిరమిల్, సునీల్ భారతి మిట్టల్, శివనాడర్, పల్లోంజి మిస్త్రీ తదితరులకు లేఖలు రాశారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని వారికి రాసిన లేఖల్లో కోరారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ఉద్యమానికి మద్దతివ్వాలని, వ్యాపారవేత్తలు కూడా చైనా ఉత్పత్తులు ఉపయోగించకూడదని విజ్ఞప్తి చేసింది.

రాత్రికి రాత్రి సాధ్యం కాదు..
చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ సూపర్ పవర్‌గా భారత ప్రయాణాన్ని పునర్నిర్మించే ఈ ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని CAIT కోరింది. మన దేశం ఎక్కువగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, సౌరశక్తి, స్మార్ట్ ఫోన్, పునరుత్పాధక ఇంధనం వంటి వాటి కోసం చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యంలో చైనా దిగుమతులు, వస్తువుల నిషేధం అంశంపై పరిశ్రమ వర్గాలు ఆసక్తి కనబరచడం లేదు. మారుతీ, బజాజ్ వంటి ఆటో సంస్థలు చైనా నుండి దిగుమతులు తగ్గించడం రాత్రికి రాత్రి సాధ్యం కాదని చెప్పాయి.

చైనాపై ఆధారపడటం క్రమంగా తగ్గించాలి
ఏళ్లుగా చైనానుండి పెద్ద ఎత్తున వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని, హఠాత్తుగా మానివేయడం ఎలా అవుతుందని, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తామని చెప్పేవారు లేకపోలేదు. అయితే క్రమంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని చెబుతున్నారు. ఇప్పటికే CAIT నిషేధం బహిష్కరించాల్సిన 500 వస్తువుల జాబితాను విడుదల చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications