For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ 2020: ఏళ్లుగా అదే ట్యాక్స్ స్లాబ్.. ఆదాయపుపన్ను రేటు తగ్గుతుందా?

|

ఆర్థిక మందగమనం నేపథ్యంలో వివిధ రంగాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఆటో, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు ఉద్దీపనలు ఇచ్చింది. అయితే ప్రజల చేతుల్లో డబ్బులేక వినిమయ శక్తిలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ రూల్స్‌లో మార్పులు, వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలపై చర్చ సాగుతోంది.

ఆదాయం తగ్గుతుందని ఆదాయపు పన్ను శాఖ పిటిషన్, జియోకు ఊరటఆదాయం తగ్గుతుందని ఆదాయపు పన్ను శాఖ పిటిషన్, జియోకు ఊరట

వినిమయ శక్తి పెంచే చర్యలు...

వినిమయ శక్తి పెంచే చర్యలు...

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వినిమయం తగ్గిన నేపథ్యంలో దీనిని పెంచే చర్యలు చేపట్టేందుకు బడ్జెట్‌లో చేపట్టే అవకాశముంది. ఇందుకు సంబంధించి సీతారామన్ వివిధ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. నిర్ణయానికి ముందు కేంద్రం వివిధ వర్గాలతో చర్చలు జరపనుందని చెబుతున్నారు.

ఇలా కూడా చేయవచ్చు..

ఇలా కూడా చేయవచ్చు..

ఆదాయపు పన్ను వడ్డీ రేట్లు తగ్గింపుతో పాటు ప్రజల చేతుల్లో డబ్బులు ఉండే ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. ఉదాహరణకు పీఎం కిసాన్ స్కీం వంటి వాటి ద్వారా ప్రజల చేతుల్లో డబ్బులు ఉంచడం, మౌలిక సదుపాయాల ఖర్చుపెంచడం ద్వారా కూడా వినిమయం పెంచవచ్చునని సూచిస్తున్నారు.

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు తర్వాత...

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు తర్వాత...

వినిమయ శక్తిని పెంచేందుకు ఆదాయపు పన్నులో మార్పులు చేయడం ద్వారా కేవలం 30 మిలియన్ ఇండివిడ్యువల్స్‌కు మాత్రమే లబ్ధి చేకూరుతుందని, వినిమయం శక్తి పెరగడం ద్వారా బ్యాలెన్స్ కావాలని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించంది. దీంతో ప్రభుత్వంపై రూ.1.45 లక్షల కోట్ల భారం పడుతోంది. ఇది పెట్టుబడులు ఆకర్షించే భాగంలో చేసింది. అయితే గత బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపులో ఎలాంటి ఊరట లేనందున తగ్గించాలని, మార్పులు చేయాలని ఆశిస్తున్నవారు ఉన్నారు.

ఆదాయపు పన్నుపై సూచన... ఏళ్లుగా ఇదే ట్యాక్స్

ఆదాయపు పన్నుపై సూచన... ఏళ్లుగా ఇదే ట్యాక్స్

డైరెక్ట్ ట్యాక్సెస్ అంశంపై వేసిన కమిటీ ఆదాయపు పన్ను అంశంపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 10 శాతం ఆదాయపు పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉన్న వారికి 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల ఆదాయం ఉన్న వారికి 30 శాతం, రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 35 శాతం పన్ను ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వారికి ట్యాక్స్ లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారికి 5 శాతం, రూ.5-10 లక్షల ఆదాయం కలిగిన వారికి 20 శాతం, రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30 శాతం ఉంది. ఈ స్లాబ్స్ చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దిగువ నుంచి మినహాయింపు ద్వారా కొంత ఉపశమనం కల్పిస్తోంది. రూ.50 లక్షల ఆదాయం కలిగిన వారికి ఆదాయం ఆధారంగా అదనంగా 10 నుంచి 37 శాతం సర్‌ఛార్జ్ ఉంటుంది.

English summary

బడ్జెట్ 2020: ఏళ్లుగా అదే ట్యాక్స్ స్లాబ్.. ఆదాయపుపన్ను రేటు తగ్గుతుందా? | Budget 2020: Income tax cuts, slab rejigs on FM's table

A flat tax rate without exemptions, new slabs for those earning higher incomes, cuts in personal income tax in line with those in corporate tax these proposals are being examined ahead of the budget as the government eyes ways of boosting consumption and reviving growth.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X