For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం, డాలర్‌కు బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా అంటే.. ఫెడ్ రిజర్వ్ చీఫ్ మాట ఇదీ

|

బిట్ కాయిన్‌కు సంబంధించి ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పోవెల్ సోమవారం హెచ్చరించారు. ప్రజలు బిట్ కాయిన్ రిస్క్‌ను అర్థం చేసుకోవాలని సూచించారు. డాలర్ లేదా బంగారానికి బిట్ కాయిన్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఇటీవల బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఏకంగా 60వేల డాలర్లను కూడా క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం 58వేల డాలర్ల వద్ద కదలాడుతోంది.

కరోనా కాలంలో జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్తూ, ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోన్న క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ పైన అమెరికా కేంద్రం బ్యాంకు ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవేల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు డాలర్ వంటి ప్రధాన కరెన్సీకి ప్రత్యామ్నాయంగా మారలేవన్నారు. వాటి విలువలో ఉత్తానపతనాలు ఊహించలేని స్థాయిలో ఉండటమే ఇందుకు కారణమన్నారు.

Bitcoin wont replace the dollar because its too volatile, Feds Powell says

ప్రధాన కరెన్సీకి ప్రభుత్వం మద్దతు ఉందని అయితే, క్రిప్టో కరెన్సీ విలువను నిర్దారించే అసెట్స్ ఏవీ లేవని గుర్తు చేశారు. స్పెక్యులేషన్ కొరకు మాత్రమే ఇవి ఉపయోగపతాయన్నారు. టెస్లా, స్క్వేర్ ఇన్వెస్ట్ వంటి దిగ్గజ కంపెనీలు బిట్ కాయిన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో జంప్ చేస్తోంది.

English summary

బంగారం, డాలర్‌కు బిట్ కాయిన్ ప్రత్యామ్నాయమా అంటే.. ఫెడ్ రిజర్వ్ చీఫ్ మాట ఇదీ | Bitcoin won't replace the dollar because it's too volatile, Fed's Powell says

Federal Reserve Chair Jerome Powell said Monday that, while the central bank is still exploring the potential for a central bank digital currency, cryptocurrencies like bitcoin can't serve as an effective replacement to the US dollar.
Story first published: Wednesday, March 24, 2021, 8:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X